అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం మొదలయ్యాయి. ఈ సమావేశాల్లో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గత టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి తమను  ఎందుకు ప్రశ్నిస్తున్నారంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఆయన ఈ విధంగా స్పందించారు.

టీడీపీ ప్రభుత్వం రుణమాఫీని అమలుచేయలేకపోయిందని కన్నబాబు విమర్శించారు. 4,5 విడతల జీవో ఎన్నికల నోటిఫికేషన్‌కు 24గంటల ముందు విడుదల చేశారని పేర్కొన్నారు. రుణమాఫీని మధ్యలో వదిలేసి అన్నదాత సుఖీభవ ప్రకటించారని ఆరోపించారు. టీడీపీ ప్రకటించిన హామీలను తమను అమలు చేయాలని మా ప్రభుత్వాన్ని అడగడమేంటి? అని కన్నబాబు ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు.