కన్నుగీటు వీడియోతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. ఆమె నటించిన మొదటి సినిమా 'ఒరు అడార్ లవ్'కి కేవలం ప్రియా ప్రకాష్ కారణంగా మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాను 'లవర్స్ డే' పేరుతో తెలుగులోనూ విడుదల చేశారు. కానీ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ప్రియా క్రేజ్ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఆమెకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అందుకే ఎప్పటికప్పుడు రకరకాల పోస్ట్ లతో అభిమానులను అలరిస్తోంది. అయితే ఇటీవల ఆమె పోస్ట్ చేసిన ఓ ఇన్స్టాగ్రామ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. ప్రియా ప్రకాష్ తో పాటు ఆమె స్నేహితుడు, సినిమాటోగ్రాఫర్ శీను సిద్ధార్థ్ కూడా ఉన్నారు. ప్రియా ప్రకాష్ 'ఒరు అడార్ లవ్' స్టైల్ లో స్కూల్ యూనిఫాంలో ఉంది. 

ఆమె భుజంపై చేయి వేసుకొని పక్కనే కూర్చొని ఉన్నాడు శీను సిద్ధార్థ్. వీరిద్దరూ ఒకరినొకరు కళ్లలో కళ్లు పెట్టుకొని చూసుకుంటూ ముద్దాడుకోవడానికి ముఖాలు దగ్గరకి తీసుకువచ్చారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే.. ప్రియా పెదాల వరకు తన పెదాలను తీసుకెళ్లిన శీను ఒక్కసారిగా డైరెక్షన్ మార్చి తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ ను నోటికి అందించుకొని నీళ్లు తాగేశాడు.

దీంతో ప్రియా తెల్లముఖం వేసుకుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రియా ప్రకాష్ ప్రస్తుతం 'శ్రీదేవి బంగ్లా' అనే హిందీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా దివంగత శ్రీదేవి చనిపోయిన విధానాన్ని గుర్తు చేసేలా ఉందని శ్రీదేవి భర్త బోనీకపూర్ 'శ్రీదేవి బంగ్లా' నిర్మాతలకు నోటీసులు పంపారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Tb to this “ithenthinte kunjade?” moment with my fav @sinu_sidharth

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on Jul 17, 2019 at 10:41pm PDT