Asianet News TeluguAsianet News Telugu

14 మందికే బాకీ, ధర్నా చేసేవాళ్లు మా ఉద్యోగులు కాదు: కేశినేని నాని

తాను ఎవరికి రూపాయి కూడా బకాయి కూడా బాకీ పడలేదన్నారు. గుంటూరు లేబర్ కోర్టులో 14 మంది కేసులు వేశారని.. వాళ్లకి మాత్రమే ఇవ్వాల్సి ఉందని, రాజీకి వచ్చి కేసు విత్ డ్రా చేసుకుంటే ఈ నిమిషంలోనే వారి బకాయిలను మాఫీ చేస్తానని కేశినేని స్పష్టం చేశారు.

vijayawada mp kesineni nani reacts on kesineni travels staff protest
Author
Vijayawada, First Published Jul 26, 2019, 5:16 PM IST

తమకు బకాయిపడ్డ వేతనాలను వెంటనే చెల్లించాలని కేశినేని ట్రావెల్స్ సిబ్బంది శుక్రవారం విజయవాడలో ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. వైసీపీ నేత పీవీపీ సైతం ఉద్యోగులకు మద్ధతుగా కేశినేని నానిపై ఫైరయ్యారు.

ఈ క్రమంలో ఈ వివాదంపై కేశినేని ట్రావెల్స్ అధినేత, ఎంపీ కేశినేని నాని స్పందించారు. తాను ఎవరికి రూపాయి కూడా బకాయి కూడా బాకీ పడలేదన్నారు. గుంటూరు లేబర్ కోర్టులో 14 మంది కేసులు వేశారని.. వాళ్లకి మాత్రమే ఇవ్వాల్సి ఉందని, రాజీకి వచ్చి కేసు విత్ డ్రా చేసుకుంటే ఈ నిమిషంలోనే వారి బకాయిలను మాఫీ చేస్తానని కేశినేని స్పష్టం చేశారు.

ఈ విషయాన్ని తాను ఎన్నికల అఫిడవిట్‌లో సైతం పొందుపరిచానని ఎంపీ తెలిపారు. కేశినేని ట్రావెల్స్ మూసివేసి రెండున్నరేళ్లు అవుతుందని.. ఈ రాద్ధాంతం వెనుక రాజకీయ కుట్ర వుందని నాని ధ్వజమెత్తారు.

ధర్నా చేసిన వారిలో కేశినేని ట్రావెల్స్ సిబ్బంది ఎవరు లేరని వారంతా కిరాయి మనుషులేనని ఆరోపించారు. ఏ కమిషన్ అయినా.. సీబీఐ, ఈడీ దర్యాప్తులకైనా తాను సిద్ధమేనని.. 2013 నుంచే కేశినేని ట్రావెల్స్ బాధ్యతల నుంచి తాను తప్పుకున్నానని నాని స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios