చంద్రబాబుకు కష్టాలు: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Jul 25, 2019, 6:29 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

జగన్ కు చిక్కులు ప్రారంభం: అమరావతే కాదు విశాఖ మెట్రో, ఇంకా...

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పుడే చిక్కులు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలోనే కాదు, ఇతర విషయాల్లోనూ ఆయన పలు చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుందనేది తాజా పరిణామాలను పరిశీలిస్తే అర్థమవుతోంది.

 

హరీష్‌రావును దెబ్బతీసేందుకే కేసీఆర్ ప్లాన్: డికె అరుణ

హైదరాబాద్: హరీష్ రావును దెబ్బతీసేందుకే  చింతమడకకు కేసీఆర్ వరాలు కురిపించారని  మాజీ మంత్రి డికె అరుణ ఆరోపించారు. హరీష్ రావును టార్గెట్ గా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.

 

తెలంగాణ సీఎం కేసీఆర్- ఏపీ సీఎం జగన్ స్నేహంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ఇరు రాష్ట్రాలకు సంబంధించి శ్రీశైలం, నాగార్జున సాగర్ వద్ద నీటి విషయంలో ఇరు రాష్ట్రాల పోలీసులు కొట్టుకునే పరిస్థితికి దిగజారిందని చెప్పుకొచ్చారు. పాకిస్థాన్-ఇండియా మాదిరిగా నీటి కోసం కొట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని తాను భావించానని చెప్పుకొచ్చారు. సమస్య పరిష్కారం కోసం గవర్నర్ ను కోరితే ఆఖరికి సమస్య ఒక పరిష్కారానికి వచ్చిందని చంద్రబాబు స్పష్టం చేశారు.  

 

ప్రముఖ కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఇక లేరు

హైదరాబాద్: ప్రముఖ తెలుగు సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఇక లేరు. ఆయన గురువారం తెల్లవారు జామున 4 గంటలకు కన్నుమూశారు. ఆయన వయస్సు 75 ఏళ్లు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 

 

చంద్రబాబుకు కష్టాలు: పోలవరంపై నిపుణుల కమిటీ కీలక సూచనలు

అమరావతి: పోలవరం ప్రాజెక్టులో  అవకతవకలు చోటు చేసుకొన్నాయని నిపుణుల కమిటీ తేల్చింది. ఈ మేరకు గత ప్రభుత్వం  చేసుకొన్న ఒప్పందాలను రద్దు చేయాలని  సిఫారసు చేసింది.  రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని నిపుణుల కమిటీ  ప్రభుత్వానికి సూచించింది.

 

హైకోర్టులో జగన్ సర్కార్ కు చుక్కెదురు: పీపీఏల పున:సమీక్షకు బ్రేక్

ఈ పరిణామాల నేపథ్యంలో 40 ప్రైవేట్ విద్యుత్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. పీపీఏలపై సమీక్ష కోసం ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని నియమిస్తూ విడుదల చేసిన జీవో 63ను రద్దు చేయాలని కోరింది. ఆయా సంస్థలు ఇప్పటికే సుమారు 15 పిటీషన్లను దాఖలు చేయగా వాటిపై జస్టిస్ ఎం.గంగారావ్ విచారణ చేపట్టారు. తీర్పును ఆగష్టు 22కు వాయిదా వేస్తూ విచారణ వాయిదా వేసింది.  

 

ఏపీ అసెంబ్లీలో గందరగోళం: 4 టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రతిపాదనతో నలుగురు శాసన సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్ సీతారాం. అయితే ఈ ఒక్కరోజు మాత్రమే సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయడంతో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

 

అసెంబ్లీలో నదీజలాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

అమరావతి: అసెంబ్లీలో గోదావరి, కృష్ణ నదీ జలాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దక్షిణ భారతదేశంలో అత్యధికంగా నీరు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు ప్రకటించారు. గోదావరి నదిలో నీరు ఉండటంతో దాని ఫలితంగా ఏపీకి అత్యధికంగా నీరు వస్తుందని చెప్పుకొచ్చారు. 

 

తాగొచ్చి కొడుతున్నాడని... భర్తను చంపిన భార్య

తాగి వచ్చి రోజూ కొడుతున్నాడని ఓ భార్య కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా పెదబయాలు మండలంలోని సిరిసిల్ల గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

 

షాద్ నగర్ జంట హత్యల కేసు: రామ సుబ్బారెడ్డికి సుప్రీంలో ఊరట

న్యూఢిల్లీ: మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. షాద్ నగర్ జంట హత్యల కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈ కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది.

 

వైసీపీపై డోసు పెంచిన బీజేపీ: మారితే ఒకే, లేకపోతే రోడ్డెక్కుతామన్న కన్నా వార్నింగ్

తెలుగుదేశం ప్రభుత్వానికి వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా లేకుండా పోయిందని ఆరోపించారు. వైయస్ జగన్ చెప్పేవి ఏమీ కింది స్థాయిలో ఏమీ జరగడం లేదన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో మతమార్పిడులు ఎక్కువ అయ్యాయని ఆరోపించారు. 
 

టీఆర్ఎస్ తో పొత్తుకోసం మీరు పాకులాడొచ్చు, మేం భవనాలు ఇస్తే తప్పా?: చంద్రబాబుపై బుగ్గన ఫైర్

అమరావతి: రాష్ట్ర విభజన, విభజన చట్టంలోని అంశాలపై ఏపీ అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ జరిగింది. ఏపీ భవనాలను తెలంగాణకు ఎలా ఇచ్చేస్తారంటూ టీడీపీ అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించింది. 

 

జషిత్ క్షేమం: తూర్పు గోదావరి ఎస్పీకి జగన్ అభినందన

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీంకు ఏపీ సీఎం వైఎస్ జగన్  అభినందించారు. నాలుగు రోజుల తర్వాత నాలుగేళ్ల చిన్నారి జషిత్‌ను పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంతో జగన్ ఎస్పీని ప్రశంసించారు.

 

జగన్ క్యాంపు కార్యాలయం దగ్గర కలకలం, వృద్ధురాలు ఆత్మహత్య

ఇప్పటి వరకు ఆమె అర్జీపై అధికారులు స్పందించకపోవడంతో గురువారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లింది. సీఎం జగన్ కు తన మెుర చెప్పుకుందామని ప్రయత్నించింది. క్యాంపు కార్యాలయం దగ్గర వేచి చూసిన అనంతరం బయటకు వచ్చిన ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. 
 

 

ఇది ఆరంభం మాత్రమే, ఎండగడతాం: చంద్రబాబు ఆగ్రహం

సభలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. తనను తిట్టించేందుకే అధికార పార్టీ సభ్యులకు మైక్ ఇస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులపై ఆర్ధిక, భౌతికదాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని పోరాటాలు మరింత ముమ్మరం చేస్తామని చంద్రబాబు తెలిపారు. 

 

బైక్ పై రాజు తీసుకెళ్లాడు,రోజూ ఇడ్లీయే పెట్టారు: జషిత్

కిడ్నాప్ కు గురైన జషిత్ ఎట్టకేలకు క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేరాడు. గురువారం నాడు ఉదయం జషిత్ ను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. రాజు అనే వ్యక్తి తనను తీసుకెళ్లాడని జషిత్ చెప్పారు.

 

కిడ్నాపర్ల చెర నుండి జషిత్ క్షేమంగా ఇంటికి

మండపేట: కిడ్నాపర్ల చెర నుండి జషిత్ కు విముక్తి లభించింది. కొడుకును చూసిన తల్లి తన గుండెలకు హత్తుకొంది. జషిత్  తిరిగి రావడంతో కుటుంబసభ్యులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకొన్నారు. 

 

సెక్రటేరియట్ ముట్టడికి విపక్షాల పిలుపు: ఎల్ రమణ, రావుల అరెస్ట్

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోందడరామ్, టీడీపీ నేత ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డిలతోపాటు విపక్ష నేతలు ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా చలో సెక్రటేరియట్ కు బయలు దేరారు. దాంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

 

వైద్యులు చెప్పారు, ఏ క్షణమైనా నేను పోవచ్చు: అక్బరుద్దీన్

కరీంనగర్: తాను  ఏ క్షణమైనా చనిపోవచ్చని వైద్యులు చెప్పారు, కానీ దాని మీద నాకేం బాధ లేదు,  కరీంనగర్ లో బీజేపీ అభ్యర్ధి ఎంపీగా గెలవడమే తనకు బాధ కల్గించిందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారు.

 

నిబంధనలు పాటించని కళాశాలలపైకొరడా: 4లక్షల మంది విద్యార్థుల్లో టెన్షన్

రాష్ట్ర వ్యాప్తంగా 1,338 ఇంటర్ కళాశాలల గుర్తింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం 361 కళాశాలలకు మాత్రమే అనుమతులు ఇచ్చింది ఇంటర్ బోర్డు. రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ కళాశాలలు నిబంధనలకు తిలోదకాలిస్తూ కళాశాలలను నడిపిస్తున్నారంటూ ఇంటర్ బోర్డు ఆరోపించింది. 

 

కారు హైజాక్ తో బయటపడ్డ ‘దొంగ బంగారం... రూ.3కోట్లకుపైగా నగదు

తుపాకీలతో బెదిరించి మరీ... కొందరు ముఠా ఓ కారును దొంగతనం చేశాయి. కారు దొంగతనానికి ఇంత సాహసం ఎందుకు చేశారా అని పోలీసులు ఆరా తీయగా.... విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఆ కారులో కోట్ల నగదు ఉందని... ఆ నగదు వెనక దొంగ బంగారం వ్యవహారం ఉందని తేలింది. 

 

సాహో కొత్త పోస్టర్స్.. మళ్ళీ కాపీ అంటూ ట్రోలింగ్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 15న రిలీజ్ అవుతుందంటూ ఆస కల్పించిన చిత్రయూనిట్ ఇటీవల ఈ చిత్రాన్ని ఆగష్టు 30కి వాయిదా వేసింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

 

బిగ్ బాస్ పై నాగ్ జోక్.. మా ఇంట్లో కూడా నమ్మలేదు.. మ్యాటర్ మాత్రం షాకింగ్!

కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం మన్మథుడు 2. రాహుల్ రవీద్రన్ దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ చిత్రానికి నాగార్జునే నిర్మాత. ఓ ఫ్రెంచ్ చిత్రానికి ఇది రీమేక్ గా తెరక్కుతోంది. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ పై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడుతూ నాగార్జున బిగ్ బాస్ షో వివాదాలపై స్పదించాడు. 

 

ఈ వయసులో ముద్దులేంటి.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన నాగార్జున!

కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 చిత్రం ఆగష్టు 9న విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేశారు ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నాగార్జున మీడియాలో మాట్లాడారు. మన్మథుడు 2లో రొమాన్స్ ఘాటుగానే ఉంది. నాగార్జున లిప్ లాక్ సన్నివేశాల గురించి ప్రస్తావన వచ్చింది. 

 

'ఆ కర్రోడు ఏదో పీకుతా అన్నాడు'.. మహేష్ విట్టాపై దురుసుగా!

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ఆసక్తికరంగా సాగుతోంది. హౌస్ లో ఉన్న సభ్యులు ఆడియన్స్ కోరుకునే ఎంటర్టైన్మెంట్ అందించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ గొడవలే రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. యూట్యూబ్ కమెడియన్ గా పాపులర్ అయిన మహేష్ విట్టా హౌస్ లో ఆసక్తికరంగా మారాడు. 

 

జరిమానాతో అల్లు అర్జున్ కు షాకిచ్చిన పోలీసులు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన కేసులో బన్నీకి జరిమానా విధించారు. ఇటీవల జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల హిమాయత్ సాగర్ ప్రాంతంలో అబ్దుల్ ఆజం అనే వాహనదారుడు టీఎస్09ఎఫ్‌జీ 0666 నంబర్‌ గల వాహనాన్ని గుర్తించాడు. 

 

గొడవ పెట్టేసి సైలెంట్ గా శ్రీముఖి.. హేమపై విరుచుకుపడ్డ రాహుల్!

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున బిగ్ బాస్ సీజన్ 3 ఆసక్తికరంగా కొనసాగుతోంది. తొలివారం కూడా పూర్తి కాకముందే ఇంటి సభ్యుల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. హౌస్ లో ఎవ్వరూ తగ్గడం లేదు. ఆధిపత్యం ప్రదర్శించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. 

 

హీరో గారి అరటిపళ్ల టాపిక్ వైరల్!

సోషల్ మీడియా వచ్చాక ప్రతీ చిన్న విషయం హైలెట్ అవుతోంది. ఏదైనా టాపిక్ మొదలైతే దాని అంతు చూడందే వదలం అన్నట్లుగా జనం రెస్పాండ్ అవుతున్నారు. వాదోపవాదోలు జరుపుతున్నారు. దాంతో ఆ టాపిక్స్ వైరల్ అవుతున్నాయి. అయితే వైరల్ అయిన ప్రతీ విషయం గొప్పదేమీ కాదు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ ..అరటిపళ్ల టాపిక్ వైరల్ గా సోషల్ మీడియాలో మారింది. 
 

 

మైనర్ బాలికపై పోలీస్ వేధింపులు: రక్షణ లేదన్న ప్రియాంక

లక్నో: తనను లైంగికంగా వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను సంప్రదించిన  బాలికకు చేదు అనుభవం ఎదురైంది. బాలిక ఫిర్యాదును స్వీకరించకపోకుండా అభ్యంతరకరమైన ప్రశ్నలు అడిగి వేధింపులకు గురి చేశాడు పోలీసు అధికారి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూరులో చోటు చేసుకొంది. 

 

యడ్యూరప్పకు తలనొప్పి: రేసులో 70 మంది ఎమ్మెల్యేలు

మంత్రివర్గ కూర్పులో మాత్రం యడ్యూరప్పకు చిక్కులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కర్ణాటక మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రితో పాటు 34 మందికి పరిమితం చేయాల్సి ఉంటుంది. ఈ 34 పదవులకు దాదాపు 70 మంది రేసులో ఉన్నారు.

 

 

 

 

 

click me!