కరీంనగర్: తాను  ఏ క్షణమైనా చనిపోవచ్చని వైద్యులు చెప్పారు, కానీ దాని మీద నాకేం బాధ లేదు,  కరీంనగర్ లో బీజేపీ అభ్యర్ధి ఎంపీగా గెలవడమే తనకు బాధ కల్గించిందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారు.

కరీంనగర్ లో జరిగిన ఎంఐఎం సభలో  అక్బరుద్దీన్  మాట్లాడారు.  గతంలో కరీంనగర్ లో ముస్లిం వ్యక్తి డిప్యూటీ మేయర్ గా ఉండేవారని ఆయన  గుర్తు చేశారు. కానీ, ఆ పరిస్థితి తారుమారైందన్నారు. ఎంఐఎంకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు, కానీ, బీజేపీకి మాత్రం ఓటేయవద్దని ఆయన కోరారు.

కరీంనగర్ లో బీజేపీ బలపడడం తనకు బాధ కల్గిస్తోందని అక్బరుద్దీన్ చెప్పారు. అనారోగ్య కారణాలతో ఇటీవలనే లండన్ కు వెళ్లి చికిత్స చేయించుకొని అక్బరుద్దీన్ హైద్రాబాద్ కు తిరిగి వచ్చారు.

ఈ నెల 18,19 తేదీల్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అక్బరుద్దీన్  పాల్గొన్నారు. కొత్త మున్సిపల్ చట్టంపై అక్బరుద్దీన్ మాట్లాడారు.