కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 చిత్రం ఆగష్టు 9న విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేశారు ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నాగార్జున మీడియాలో మాట్లాడారు. మన్మథుడు 2లో రొమాన్స్ ఘాటుగానే ఉంది. నాగార్జున లిప్ లాక్ సన్నివేశాల గురించి ప్రస్తావన వచ్చింది. 

ఈ చిత్రంలో ముద్దు సన్నివేశాలు కాస్త ఎక్కువగా ఉన్నట్లున్నాయి అని ఓ విలేఖరి ప్రశ్నించగా.. మీరు నా గీతాంజలి చిత్రం చూశారా అని నాగ్ ప్రశ్నించాడు. ఆ చిత్రంలో రెండున్నర నిమిషం పాటు ముద్దు సన్నివేశం ఉంటుందని నాగార్జున తెలిపాడు. అప్పుడు మీరు యువకుడు. కానీ ఇప్పుడు మీ వయసు పెరిగిందిగా అని విలేఖరి ప్రశ్నించాడు. 

అప్పటికి ఇప్పటికి ముద్దు సన్నివేశాల్లో నటించడంలో మెచ్యూరిటీ పెరిగింది అంటూ నాగార్జున సరదాగా సమాధానం ఇచ్చాడు. మన్మథుడు చిత్రానికి మన్మథుడు 2 కి ఏమాత్రం సంబంధం లేదు అని నాగార్జున తెలిపాడు. ఈ రెండు చిత్రాలని చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశానని నాగ్ తెలిపాడు.