యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 15న రిలీజ్ అవుతుందంటూ ఆస కల్పించిన చిత్రయూనిట్ ఇటీవల ఈ చిత్రాన్ని ఆగష్టు 30కి వాయిదా వేసింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

తాజాగా చిత్ర యూనిట్ సాహూ కొత్త పోస్టర్స్ ని రిలీజ్ చేసింది. యాక్షన్ ప్రియులకు కనువిందు కలిగించేలా ప్రభాస్ ఈ పోస్టర్స్ లో కనిపిస్తున్నాడు. మధ్యలో ఉన్న గ్లాస్ ని బ్రేక్ చేసి ప్రత్యర్థులపై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాడు.  ఈ పోస్టర్ లో శ్రద్దా దాస్ కూడా కనిపిస్తోంది. 

ఇప్పటికే విడుదలైన సాహో పోస్టర్స్ పై అనేక పోలికలు కనిపించాయి. తాజాగా విడుదలైన పోస్టర్స్ కూడా కాపీ అంటూ కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రెయిన్బో సిక్స్ సీజ్ అనే గేమ్ కు సంబంధించిన థీమ్ పోస్టర్ కు, సాహో పోస్టర్ కు దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. ఇది కేవలం పోస్టర్స్ కు సంబంధించిన వ్యవహారమే కాబట్టి పెద్ద గా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సాహో చిత్రంపై నెమ్మదిగా ఆసక్తిని పెంచే ప్రయత్నం చిత్ర యూనిట్ చేస్తోంది.