అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైయస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో న్యాయం జరగకపోవడంతో మనస్తాపంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. 

వివరాల్లోకి వెళ్తే కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గానికి చెందిన సత్యనాగ కుమారి ఈనెల 19న తనకు జరిగిన అన్యాయంపై స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. తాను మోసపోయానని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. 

అయితే ఇప్పటి వరకు ఆమె అర్జీపై అధికారులు స్పందించకపోవడంతో గురువారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లింది. సీఎం జగన్ కు తన మెుర చెప్పుకుందామని ప్రయత్నించింది. క్యాంపు కార్యాలయం దగ్గర వేచి చూసిన అనంతరం బయటకు వచ్చిన ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. 

సత్యనాగకుమారి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు గమనించారు. అప్పటికే ఆమె నిద్రమాత్రలు మింగడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.