కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ఆసక్తికరంగా సాగుతోంది. హౌస్ లో ఉన్న సభ్యులు ఆడియన్స్ కోరుకునే ఎంటర్టైన్మెంట్ అందించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ గొడవలే రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. యూట్యూబ్ కమెడియన్ గా పాపులర్ అయిన మహేష్ విట్టా హౌస్ లో ఆసక్తికరంగా మారాడు. 

తనని తక్కువగా అంచనా వేయొద్దు అంటూ ఇదివరకే జాఫర్ కు వార్నింగ్ ఇచ్చాడు. నాల్గవ ఎపిసోడ్ లో కూడా మహేష్ కేంద్రంగా ఓ సంఘటన జరిగింది. నాల్గవ ఎపిసోడ్ లో బిగ్ బాగ్ ఇంటి సభ్యులకు చిన్న పిల్లలా నటించాలని టాస్క్ ఇచ్చారు. కానీ ఆ టాస్క్ లో మహేష్ పాల్గొనలేదు. రోహిణి, రవికృష్ణ, చిన్మయి చిన్నపిల్లల వేషంలో నానా హంగామా చేశారు. 

మహేష్ మాత్రం దుప్పటి కప్పుకుని పడుకున్నాడు. రోహిణి, రవికృష్ణ.. మహేష్ గురించి మాట్లాడుకుంటూ దురుసుగా కామెంట్స్ చేశారు. మహేష్ ని కర్రోడు అంటూ రవికృష్ణ సంభోదించాడు. ఆ కర్రోడు మహేష్ ఏదో పీకుతా అన్నాడు. కుర్రోడిని నాలో సత్తా ఉందని చెప్పాడు. కానీ ఇప్పుడు మాత్రం టాస్క్ లో పాల్గొనకుండా ముసుగేసుకుని పడుకున్నాడు అంటూ రవికృష్ణ కామెంట్ చేశాడు. 

ఈ కామెంట్స్ ని మహేష్ విన్నాడు. రవికృష్ణ వ్యాఖ్యలకు మహేష్ మనస్తాపానికి గురయ్యాడు. కర్రోడు ఏంటి.. చదువుకోలేదా నువ్వు.. ఇలాగేనా మాట్లాడేది అని నిలదీశాడు. నాకు ఈ టాస్క్ లో పాల్గొనడం ఇష్టం లేదు. బిగ్ బాస్ లో చిన్నపిల్లలా ప్రవర్తించామన్నారు కానీ పిచ్చోళ్ళలా కాదు అంటూ రవి కృష్ణ కు చురకలంటించాడు. ఆ తర్వాత రవికృష్ణ మహేష్ కు క్షమాపణలు తెలిపాడు.