తాగి వచ్చి రోజూ కొడుతున్నాడని ఓ భార్య కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా పెదబయాలు మండలంలోని సిరిసిల్ల గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సిరిసిల్ల గ్రామానికి చెందిన బోంజిబాబు(44)కు మద్యానికి బానిసగా మారాడు. రోజూ విపరీతంగా మద్యం సేవించి ఆ తర్వాత ఇంటికి వచ్చి భార్య మల్లమ్మను రోజూ కొట్టేవాడు. భర్త రోజూ నానా రకాలు హింసిస్తూన్నా ఆమె భరిస్తూ వచ్చింది. కాగా... మంగళవారం రాత్రి రోజూలాగానే బోంజిరాజు మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. తాగిన మైకంలో భార్యను కొట్టడం మొదలుపెట్టాడు.

భర్త పెడుతున్న హింసను తట్టుకోలేక తనను తాను రక్షించుకోవడానికి పక్కనే ఉన్న గొడ్డలితో అతనిపై దాడి చేసింది. గొడ్డలి వేటు గట్టిగా తగలడంతో.. బోంజిరాజు అక్కడికక్కడే కన్నుమూశాడు. అరపులు విన్న స్థానికులు వారి ఇంటికి పరుగులు తీశారు. అప్పటికే బోంజిరాజు రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు.

స్థానికులు పరిశీలించగా... చనిపోయి ఉన్నాడు. వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేయగా.. వారు వచ్చి చనిపోయాడని ధ్రువీకరించారు. అనంతరం మృతదేహాన్ని హాస్పిటల్ కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు.