మండపేట: కిడ్నాపర్ల చెర నుండి జషిత్ కు విముక్తి లభించింది. కొడుకును చూసిన తల్లి తన గుండెలకు హత్తుకొంది. జషిత్  తిరిగి రావడంతో కుటుంబసభ్యులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకొన్నారు. 

తూర్పు గోదావరి జిల్లా కుతుకులూరు రోడ్డులోని చింతాలమ్మ గుడి వద్ద నాలుగేళ్ల జషిత్ ను కిడ్నాపర్లు రోడ్డుపై వదిలిపెట్టారు. అక్కడే ఉన్న క్వారీ కార్మికులు  గుర్తించారు. క్వారీ కార్మికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు జషిత్ ను తీసుకొచ్చి  తల్లిదండ్రులకు అప్పగించారు.

గురువారం నాడు ఉదయం జషిత్ ను కిడ్నాపర్లు రోడ్డుపై వదిలిపెట్టారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు కుటుంబసబ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా తల్లిదండ్రులు కూడ సంఘటన స్థలానికి చేరుకొన్నారు.

సంఘటనస్థలం నుండి ఎస్పీ నయిం తన కారులో జషిత్ను ఇంటికి తీసుకొచ్చాడు. జషిత్ ను ఎత్తుకొని వచ్చి ఎస్పీ నయిం కుటుంబసభ్యులకు అప్పగించారు.గురువారం ఉదయం ఐదున్నర గంటలకు క్వారీ కార్మికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అంతేకాదు క్వారీ కార్మికులు జషిత్ ఇంటికి సమీపంలో తెలిసిన వారికి కూడ సమాచారం ఇచ్చారు. ఈ సమాచారాన్ని ఫోన్ సమాచారం రిసీవ్ చేసుకొన్న వారు తమ బైక్ పై సంఘటన స్థలానికి చేరుకొన్నారు.

సంబంధిత వార్తలు

జషిత్ నా వద్దే ఉన్నాడు: తండ్రికి ఢిల్లీ నుండి ఫోన్

మండపేట బాలుడి కిడ్నాప్ కేసులో పురోగతి.. నిందితుల గుర్తింపు

మండపేటలో బాలుడి కిడ్నాప్: ఇంకా దొరకని ఆచూకీ