జగన్ కు చిక్కులు ప్రారంభం: అమరావతే కాదు విశాఖ మెట్రో, ఇంకా...

First Published 25, Jul 2019, 3:40 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పుడే చిక్కులు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలోనే కాదు, ఇతర విషయాల్లోనూ ఆయన పలు చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుందనేది తాజా పరిణామాలను పరిశీలిస్తే అర్థమవుతోంది.

అమరావతి నిర్మాణం ప్రాజెక్టు నుంచి ప్రపంచ బ్యాంక్ మాత్రమే కాకుండా చైనాకు చెందిన ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్  (ఎఐఐబి) కూడా వెనక్కి తగ్గింది. దీంతో అమరావతి నిర్మాణం కోసం పెట్టుబడులను రాబట్టడం ఎలా అనేది జగన్ అత్యంత తీవ్రమైన విషయమే అవుతుంది.

తాజా పరిణామాల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి అమరావతి నిర్మాణం నుంచి బ్యాంకులు తప్పుకోవడం మాత్రమే కారణం కాదు, ప్రభుత్వం ఇసుక విధానాన్ని కేంద్రీకృతం చేయడం కూడా కారణం. దానివల్ల భవన నిర్మాణాలకు ఇసుక లభించడం  లేదు. ఈ సమస్యను జగన్ పరిగణనలోకి తీసుకోవాల్సే ఉంది.

అమరావతి ప్రాజెక్టు నుంచి రెండు ప్రధాన బ్యాంకులు తప్పుకోవడమే జగన్ ప్రభుత్వానికి తీవ్రమైన దెబ్బ అయితే, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు నుమచి కొరియాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ వెనక్కి వెళ్లింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పట్టాలని అనుకునేవాళ్లు పునరాలోచన చేసే పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడులు రాకపోతే జగన్ తీవ్రమైన కష్టాలనే ఎదుర్కోవాల్సి వస్తుంది.

రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డికి చిక్కులు ప్రారంభమయ్యాయి. బిజెపి నేతలు జగన్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. చంద్రబాబు పరిస్థితే జగన్మోహన్ రెడ్డికి పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పడడం వల్ల పెనం నుంచి పొయ్యిలో పడినట్లయిందని వారు వ్యాఖ్యానించారు బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, నేతలు దగ్గుబాటి పురంధేశ్వరి, మాధవ్ తదితరులు జగన్ ను లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

బిజెపి లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కాబట్టి జగన్మోహన్ రెడ్డిని లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్న తరుణంలో కేంద్రం చేయూత అందించే పరిస్థితి కూడా లేదు. రాష్ట్రానికి కేంద్రం నుంచి 80 వేల కోట్లు రావాల్సి ఉంది. అయితే, ఆ నిధులను కేంద్రం విడుదల చేస్తుందా, లేదా అనేది కూడా సందేహంగానే ఉంది

రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి రావడానికి ప్రధానంగా పనిచేసింది అమ్మ ఒడి పథకం. అమ్మ ఒడి పథకం అమలు విషయంలో జగన్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండింది. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని జగన్ చెప్పగానే విమర్శలు ప్రారంభమయ్యాయి. దాంతో ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే అది వర్తిస్తుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. అది కాస్తా వ్యతిరేక ఫలితం ఇస్తుందని భావించి, ఆ పథకం ప్రైవేట్ పాఠశాలలకు కూడా వర్తిస్తుందని జగన్ చెప్పారు

ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తయారు చేస్తానని జగన్ చెబుతున్నారు. అయితే, అమ్మ ఒడి పథకాన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు కూడా వర్తింపజేసినప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులను తమ పిల్లలను చేరుస్తారా అనేది అనుమానమే. అందువల్ల ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసే అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండకపోవచ్చు

గ్రామ సచివాలయాలకు కొత్త ఉద్యోగులను తీసుకుంటామని జగన్ చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న ఉద్యోగులను ఏం చేస్తారనే స్పష్టత లేదు. ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి లక్షా 30 వేల మంది గ్రామ వాలంటీర్లను నియమిస్తామని జగన్ చెప్పారు. నిజానికి, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ జర్మనీలో ఉంది.

జర్మనీలోనూ, ఇతర దేశాల్లోనూ సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నన్ని లేవు. అక్కడ ఒక్క పథకం మాత్రమే ఉంటుంది. దాన్ని గ్రామ వాలంటీర్ల ద్వారా అమలు చేస్తారు. అయితే, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ మరో జన్మభూమి పథకంలా తయారు కాదని చెప్పలేని పరిస్థితి. గ్రామ వాలంటీర్లుగా వైసిపికి చెందినవారినే వియమిస్తే అది చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని జన్మభూమి పథకంలా మారే ప్రమాదం ఉంది. తెలుగుదేశం పార్టీ ఓటమికి జన్మభూమి పథకమే ప్రధాన కారణమని విశ్లేషకులు అంచనా వేశారు.

శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు రెండు రాష్ట్రాల ఆస్తి అని జగన్  చెప్పారు. గోదావరి నది జలాలను కృష్ణా ఆయకట్టుకు మళ్లించడం ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కృష్ణా ఆయకట్టుకు నీటిని అందిస్తామని సీఎం  జగన్ ప్రకటించారు.

loader