MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • National
  • Spa Center : స్పా ముసుగులో అసలు కథ వేరే ఉంది.. కండోమ్‌ల కుప్పలు చూసి షాకైన పోలీసులు

Spa Center : స్పా ముసుగులో అసలు కథ వేరే ఉంది.. కండోమ్‌ల కుప్పలు చూసి షాకైన పోలీసులు

Surat Spa Center : సూరత్ రాజ్‌ వరల్డ్ షాపింగ్ సెంటర్‌లోని స్పా పై పోలీసులు దాడి చేశారు. స్పా ముసుగులో సాగుతున్న అనైతిక కార్యకలాపాల రాకెట్‌ను ఛేదించారు. కండోమ్‌ల కుప్పలను చూసి పోలీసులు విస్తుపోయారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 08 2026, 06:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కండోమ్ గుట్టలు, డైరీలో కస్టమర్ల లిస్టు.. స్పా సెంటర్‌లో అడ్డంగా దొరికిపోయారు
Image Credit : Gemini

కండోమ్ గుట్టలు, డైరీలో కస్టమర్ల లిస్టు.. స్పా సెంటర్‌లో అడ్డంగా దొరికిపోయారు

గుజరాత్‌లోని సూరత్ నగరంలో స్పా ముసుగులో సాగుతున్న అనైతిక కార్యకలాపాల (పడుపు వృత్తి) ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పాలన్‌పూర్ పాటియా ప్రాంతంలోని రాజ్ వరల్డ్ షాపింగ్ సెంటర్ లోని ఒక స్పా లో సాగుతున్న ఈ అనైతిక కార్యకలాపాలపై సమాచారం అందుకున్న పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ సోదాల్లో అక్కడ లభించిన ఆధారాలు చూసి పోలీసులు సైతం విస్తుపోయారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రాజ్ వరల్డ్ షాపింగ్ సెంటర్‌లో నడుస్తున్న స్పా
Image Credit : Getty

రాజ్ వరల్డ్ షాపింగ్ సెంటర్‌లో నడుస్తున్న స్పా

సూరత్ నగరంలోని పాలన్‌పూర్ పాటియా ప్రాంతంలో ఉన్న రాజ్‌ వరల్డ్ షాపింగ్ సెంటర్ మూడవ అంతస్తులో ఒక స్పా నడుస్తోంది. అయితే, ఇక్కడ స్పా పేరుతో అనైతిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని డీసీపీ జోన్ 7 ఎల్‌సీబీ బృందానికి పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు ఇతర బృందాలతో కలిసి సంయుక్తంగా ఈ కేంద్రంపై దాడి చేశారు. 

లోపలికి వెళ్లి చూడగా, చిన్న చిన్న గదుల్లో మహిళలు అభ్యంతరకర స్థితిలో కనిపించారు. ఈ దాడిలో ముగ్గురు కస్టమర్లు సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో నలుగురు మహిళలను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు.

Related Articles

Related image1
OTT: ఓటీటీలోకి క్రేజీ హీరో జీవా సూపర్ హిట్ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
Related image2
T20 World Cup 2026 : మిలింద్ కుమారా ఏంటా పిచ్చి పని? ఇషాన్ కిషన్ దెబ్బకు మైండ్ బ్లాక్
36
మొబైల్ ఫోన్ల ద్వారా కస్టమర్లతో బేరసారాలు
Image Credit : Gemini AI

మొబైల్ ఫోన్ల ద్వారా కస్టమర్లతో బేరసారాలు

ఈ  ముఠా చాలా పక్కాగా నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కస్టమర్లకు మహిళల ఫోటోలు పంపడానికి వీరు ప్రత్యేకంగా మొబైల్ ఫోన్లను ఉపయోగించేవారు. ఘటనా స్థలం నుండి పోలీసులు మొత్తం 11 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 7 ఫోన్లను కేవలం కస్టమర్లతో కమ్యూనికేట్ చేయడానికి, ఫోటోలు పంపడానికి వాడేవారని గుర్తించారు. మిగిలిన నాలుగు ఫోన్లు అక్కడ పట్టుబడ్డ కస్టమర్లకు చెందినవిగా నిర్ధారించారు.

46
కుప్పలుగా కండోమ్‌లు.. నగదు స్వాధీనం
Image Credit : our own

కుప్పలుగా కండోమ్‌లు.. నగదు స్వాధీనం

స్పా సెంటర్‌లో తనిఖీలు చేసిన పోలీసులకు భారీ మొత్తంలో ఉపయోగించని కండోమ్ ప్యాకెట్లు లభించాయి. వాటి పరిమాణం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. వీటితో పాటు రూ. 8,500 నగదు, వివిధ రకాల బిల్లులు, నాలుగు చిన్న పాకెట్ డైరీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలలో రోజువారీ వ్యాపార లావాదేవీలు, మహిళల పేర్లు, కస్టమర్ల వివరాలను నమోదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే, కస్టమర్ల లావాదేవీల కోసం ఉపయోగించే 39 రంగు రంగుల టోకెన్లను కూడా పోలీసులు సీజ్ చేశారు.

56
నిఘా కోసం సీసీటీవీ కెమెరాలు, వాచ్‌మెన్
Image Credit : Asianet News

నిఘా కోసం సీసీటీవీ కెమెరాలు, వాచ్‌మెన్

పోలీసుల కళ్లు గప్పేందుకు స్పా నిర్వాహకులు భారీ ఏర్పాట్లే చేసుకున్నారు. స్పా లోపల, బయట నిఘా ఉంచడానికి సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలీసులు వస్తున్నారో లేదో గమనించడానికి విపిన్ అలియాస్ రింకూ అనే వ్యక్తిని కాపలాగా ఉంచేవారు. దాడి సమయంలో పోలీసులు సీసీటీవీకి సంబంధించిన డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో స్పా మేనేజర్ శూద్రో చక్రవర్తి, సహాయకుడు విపిన్ జగదీష్ షాహు ఉన్నారు. కస్టమర్లుగా వచ్చిన కరణ్ దీపక్ భాయ్ షా, వీరసింగ్ శాంతిజీ కోలి, ఉమేష్ దిలీప్ శర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

66
నిందితులపై కేసులు నమోదు
Image Credit : Asianet News

నిందితులపై కేసులు నమోదు

ఈ స్పా ప్రధాన యజమాని ఆకాష్ అంకుశ్‌భాయ్ ధనవాడే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితులందరిపై 1956 అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం, 2023 భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న యజమాని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ దాడులతో సూరత్ నగరంలోని ఇతర అక్రమ స్పా సెంటర్ల నిర్వాహకుల్లో వణుకు మొదలైంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఏషియానెట్ న్యూస్
భారత దేశం
పోలీసు భద్రత

Latest Videos
Recommended Stories
Recommended image1
ఏపీ, తెలంగాణ నుంచి వాయు కాలుష్యం ఇత‌ర ప్రాంతాల‌కు వ్యాపిస్తుందా? అధ్య‌య‌నంలో విస్తుపోయే నిజాలు
Recommended image2
Anant Ambani: చెరువులోనే బతుకుతున్న బాలుడు.. ముంబైకి తీసుకెళ్లిన అనంత్ అంబానీ
Recommended image3
India Skills Report 2026: ఉద్యోగాలు సాధించడంలో ఆ రాష్ట్ర యువతే టాప్.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?
Related Stories
Recommended image1
OTT: ఓటీటీలోకి క్రేజీ హీరో జీవా సూపర్ హిట్ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
Recommended image2
T20 World Cup 2026 : మిలింద్ కుమారా ఏంటా పిచ్చి పని? ఇషాన్ కిషన్ దెబ్బకు మైండ్ బ్లాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved