హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో విపక్షాల చలో సెక్రటేరియట్ ముట్టడి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. సచివాలయ కూల్చివేత, అసెంబ్లీ తరలింపునకు వ్యతిరేకంగా గురువారం అఖిలపక్ష నేతలు చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 

జి.వెంకటస్వామి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలోని ప్రజాస్వామిక తెలంగాణ వేదిక నేతృత్వంలో గురువారం ఇందిరాపార్క్‌ దగ్గర ధర్నా చేపట్టారు. పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అఖిలపక్ష నేతలు హాజరయ్యారు.  

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోందడరామ్, టీడీపీ నేత ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డిలతోపాటు విపక్ష నేతలు ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా చలో సెక్రటేరియట్ కు బయలు దేరారు. దాంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.