స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన కేసులో బన్నీకి జరిమానా విధించారు. ఇటీవల జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల హిమాయత్ సాగర్ ప్రాంతంలో అబ్దుల్ ఆజం అనే వాహనదారుడు టీఎస్09ఎఫ్‌జీ 0666 నంబర్‌ గల వాహనాన్ని గుర్తించాడు. 

ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రత్యేకంగా వెళుతున్న ఆ వాహనాన్ని గమనించాడు. క్యారవాన్ అద్దాలు పూర్తిగా బ్లాక్ షేడ్ తో కప్పబడి ఉన్నాయి. రాష్ట్రంలో బ్లాక్ షేడ్ ఉన్న అద్దాలపై నిషేధం ఉంది. అది గమనించిన అబ్దుల్ పోలీస్ లకు ఫిర్యాదు చేశాడు. 

శంషాబాద్ పోలీసులు ఆ వాహనం నంబర్ పై విచారణ చేయగా అల్లు అర్జున్ కు చెందిన వెహికల్ అని తేలింది. దీనితో పోలీసులు బన్నీ రూ. 735 జరిమానా విధించారు. ఇటీవల ట్రిపుల్ రైడ్ లో ప్రయాణించినందుకు రాంగోపాల్ వర్మకు కూడా పోలీసులు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. 

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత బన్నీ కోసం వేణు శ్రీరామ్, సుకుమార్ లాంటి దర్శకులు బన్నీ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.