కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీంకు ఏపీ సీఎం వైఎస్ జగన్  అభినందించారు. నాలుగు రోజుల తర్వాత నాలుగేళ్ల చిన్నారి జషిత్‌ను పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంతో జగన్ ఎస్పీని ప్రశంసించారు.

నాలుగు రోజుల క్రితం జషిత్‌ను కిడ్నాపర్లు ఎత్తుకెళ్లారు. ఈ విషయమై అప్పుడే సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించాలని పోలీసులను ఆదేశించారు. జషిత్ కోసం 17 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

గురువారం ఉదయం జషిత్ కుతకుతలూరు సమీపంలోని చింతాలమ్మ గుడి వద్ద  ఉన్న ఇటుక బట్టీ వద్ద  చిన్నారి జషిత్ ను వదిలి వెళ్లారు. ఇటుక బట్టీ కార్మికులు జషిత్ తండ్రికి సమాచారం ఇచ్చారు. ఇవాళ ఉదయం పోలీసులు జషిత్ ను తల్లిదండ్రులకు అప్పగించారు.

సోమవారం నాడు జషిత్‌ను కిడ్నాపర్లు తీసుకెళ్లారు. సోమవారం నుండి జషిత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మీడియా, సోషల్ మీడియాతో పాటు స్థానికులు కూడ జషిత్ కోసం గాలించారు. దీంతో కిడ్నాపర్లు గురువారం నాడు తెల్లవారుజామున జషిత్ ను వదిలివెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

నాలుగు రోజుల తర్వాత ఇంటికి జషిత్ : భావోద్వేగానికి గురైన పేరేంట్స్

కిడ్నాపర్లను పట్టుకొంటాం: ఎస్పీ నయీం

బైక్ పై రాజు తీసుకెళ్లాడు,రోజూ ఇడ్లీయే పెట్టారు: జషిత్

కిడ్నాపర్ల చెర నుండి జషిత్ క్షేమంగా ఇంటికి

జషిత్ నా వద్దే ఉన్నాడు: తండ్రికి ఢిల్లీ నుండి ఫోన్

మండపేట బాలుడి కిడ్నాప్ కేసులో పురోగతి.. నిందితుల గుర్తింపు

మండపేటలో బాలుడి కిడ్నాప్: ఇంకా దొరకని ఆచూకీ