షాద్ నగర్ జంట హత్యల కేసు: రామ సుబ్బారెడ్డికి సుప్రీంలో ఊరట
మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి సుప్రీంకోర్టులో ఐరట లభించింది. షాద్ నగర్ జంట హత్యల కేసులో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది.
న్యూఢిల్లీ: మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. షాద్ నగర్ జంట హత్యల కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈ కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది.
1990 డిసెంబర్ 5వ తేదీన ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలోని షాద్‌నగర్ బస్టాండ్‌లో అప్పటి కాంగ్రెస్ నేతలు దేవగుడి శివశంకర్ రెడ్డి, లక్కిరెడ్డి గోపాల్‌రెడ్డిలను ప్రత్యర్థులు హత్య చేశారు. హత్యకు గురైన వారు ప్రస్తుత మంత్రి ఆదినారాయణరెడ్డి చిన్నాన్న.
మరో వైపు ఈ హత్యలకు ప్రతీకారంగా టీడీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి బాబాయ్ శివారెడ్డిని ప్రత్యర్థులు హైద్రాబాద్‌లో హత్య చేశారు. గతంలో వీరిద్దరూ కూడ వేర్వేరు పార్టీల్లో ఉండేవారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఫ్యాక్షన్ గొడవలు సాగేవి. ఆదినారాయణరెడ్డి కాంగ్రెస్ నుండి వైసీపీలో చేరారు.
వైసీపీ నుండి ఆయన టీడీపీలో చేరారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రామసుబ్బారెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలోనే ఈ కేసులో రామ సుబ్బారెడ్డికి శిక్షపడింది. దీంతో రామసుబ్బారెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై రామసుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రామసుబ్బారెడ్డికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ కేసులో రామసుబ్బారెడ్డిని నిర్ధోషిగా తేల్చడంతో ఆదినారాయణరెడ్డి వర్గీయులు 2008లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆదినారాయణరెడ్డి వర్గీయులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత ఆదినారాయణరెడ్డి వైఎస్ఆర్‌సీపీలో ఆ తర్వాత టీడీపీలో చేరారు ఆదినారాయణరెడ్డి.గత చంద్రబాబు ప్రభుత్వంలో ఆదినారాయణరెడ్డి మంత్రిగా కూడ పనిచేశారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో షాద్ నగర్ జంట హత్యల కేసులో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి 23 మాసాల పాటు జైలు జీవితాన్ని గడిపారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, మరో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కూడ ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు.