సహించలేకే ప్రభుత్వంపై రాల్లేస్తున్నారన్న సీఎం జగన్: మరిన్ని వార్తలు

By Siva KodatiFirst Published Sep 10, 2019, 1:35 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

ప్రభుత్వంపై రాళ్లేస్తుంది అందుకే: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. అవినీతిని అడ్డుకోవడాన్ని సహించలేని వారు లేని పోని రాద్ధాంతాలు సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తుంటే దాన్ని ఓర్వలేని వాళ్లు ప్రభుత్వంపై రాళ్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మమ్మల్ని చంపేస్తారా, రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తారా: నీ అధికారం అంతు చూస్తానంటూ చంద్రబాబు ఆగ్రహం

సీఎం జగన్ చెబితే మమ్మల్ని చంపేస్తారా అంటూ పోలీసులను నిలదీశారు చంద్రబాబు. అందర్నీ చంపి రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తారా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ చట్ట వ్యతిరేక పార్టీ కాదని పోలీసులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. 

గతంలో నన్ను అరెస్ట్ చేయలేదా...? చంద్రబాబు మీ జిమ్మిక్కులు తెలుసు: బొత్స సత్యనారాయణ ఫైర్

సీఎం జగన్ కు వస్తున్న ప్రజాఆదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారంటూ మండిపడ్డారు. అందుకే రాష్ట్రంలో గందరగోళం సృష్టించాలని కుట్రపన్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు జిమ్మికులు తనకు తెలుసునంటూ నిప్పులు చెరిగారు. 

బీజేపీ-టీఆర్ఎస్ రెండూ ఒక్కటే, వారిది ఉత్తుత్తి పోరాటం: ఎంపీ రేవంత్ రెడ్డి

టీఆర్ఎస్‌తో ఉత్తుత్తి ఫైట్ చేస్తూ ప్రజలను బీజేపీ మోసం చేస్తుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ డబుల్ మైండ్‌ గేమ్‌‌ను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లలో అవినీతిపై త్వరలోనే గవర్నర్‌ తమిళ ఇసై సౌందర రాజన్ కు ఫిర్యాదు చేస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్, సిద్ధం చేస్తున్న బీజేపీ: మాజీ ఎంపీ సంచలనం

మహారాష్ట్ర ఎన్నికల అనంతరం హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని బీజేపీ వ్యూహరచన చేస్తోందని తెలిపారు. రాజ్యసభలో మెజారిటీ కోసం బీజేపీ ఎదురుచూస్తోందని స్పష్టం చేశారు. 

దమ్ముంటే కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీజేపీ నుంచి గెలవాలి: కోమటిరెడ్డికి టీ-కాంగ్రెస్ సవాల్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి మునుగోడు నుంచి గెలవాలని సవాల్ విసిరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ పార్టీ అధిష్టానాన్ని కోరనున్నట్లు మల్లు రవి స్పష్టం చేశారు. 

కేబినెట్ విస్తరణ: అసంతృప్తులకు టీఆర్ఎస్ బుజ్జగింపులు

మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో  అసంతృప్తికి గురైన పార్టీ ప్రజా ప్రతినిధులకు టీఆర్ఎస్ నాయకత్వం బుజ్జగింపులకు దిగింది. మంత్రి పదవి దక్కకోపవడంతో కొందరు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. దీంతో  పార్టీ నాయకత్వం హుటాహుటిన రంగంలోకి దిగింది.

లోక్‌సభ ఫలితాల ఎఫెక్ట్: కరీంనగర్‌పై కేసీఆర్ ప్రత్యేక దృష్టి

పోగోట్టుకొన్న చోటే వెతుక్కోవాలి అనేది నానుడి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు టీఆర్ఎస్ కార్యాచరణను ప్రారంభించింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ స్థానంలో టీఆర్ఎస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.

 

నిఖార్సయిన టీఆర్ఎస్ వాదిని, మంత్రి పదవినే త్యాగం చేశా: మాజీమంత్రి జూపల్లి క్లారిటీ

టీఆర్ఎస్ పార్టీని వీడతారంటూ వస్తున్న వార్తలపై మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తాను టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తాను నిఖార్సైన టీఆర్ఎస్ పార్టీ నాయకుడినని చెప్పుకొచ్చారు. 

కాంగ్రెస్ పార్టీకి స్టార్ హీరోయిన్ గుడ్ బై

సమున్నత లక్ష్యం కోసం కాంగ్రెస్‌లో తాను పనిచేయాలనుకున్నానని, అయితే అంతర్గత రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగపడటం తనకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. అందువల్లే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఊర్మిళ ప్రకటించారు. 

ఇకపోతే సార్వత్రిక ఎన్నికల్లో తాను ఓటమి చెందినప్పటికీ పార్టీ పరంగా పోరాటం చేశానని ఆత్మసాక్షిగా, ఎంతో గౌరవంతో ఈ ఎన్నికల్లో శ్రమించానని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో తాను ఎంతో నేర్చుకున్నానని స్పష్టం చేశారు. అయితే రాజకీయాలు వదిలి తాను ఎక్కడికీ వెళ్లనని ఊర్మిళ చెప్పుకొచ్చారు. 

ఒళ్లుదగ్గర పెట్టుకుని పనిచేశా, కేసీఆర్ సీఎంలా కనిపించరు: మంత్రి గంగుల కమలాకర్

టీడీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి కేసీఆర్ స్పూర్తితో టీడీపీలో తెలంగాణ వాదాన్ని వినిపించి పార్టీని వీడిన మెుట్టమొదటి ఎమ్మెల్యే తానేనని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ను చూస్తే సీఎంలా కనిపించరని ఆయన ఓ డిక్షనరీ అంటూ ప్రశంసించారు.  

చదువుకున్న వాళ్లకే కులపిచ్చి, జమిలి ఎన్నికలకు ఛాన్స్: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రజలు రివర్స్ ఎన్నికలు కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రివర్స్ పాలన కొనసాగుతున్నా రివర్స్ ఎన్నికలు వచ్చే ఆస్కారం లేదన్నారు. కానీ జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. జమిలి ఎన్నికలు వస్తే రాబోయే మూడు సంవత్సరాల్లో వచ్చే ఛాన్స్ ఉందన్నారు చంద్రబాబు నాయుడు. 

నేరుగా రంగంలోకి అమిత్ షా: ఏపీలో ఇక చేరికల జోరు

 

ఏపీ రాష్ట్రంలో బలోపేతం కావడానికి బీజేపీ ప్లాన్ చేస్తోంది. రానున్న రోజుల్లో ఈ ప్లాన్ ను అమలు చేయాలని ఆ పార్టీ  భావిస్తోంది.టీడీపీతో పాటు ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరికలపై ఫోకస్ పెట్టనున్నారు. నెలకు ఓ రోజు ఏపీ రాష్ట్రంలో అమిత్ షా పర్యటించేలా ప్రణాళికలు సిద్దం చేసుకొంటున్నారు.

 

ఒకే దెబ్బకు రెండు రికార్డులు బద్దలు... కోహ్లీ, యూసఫ్ లను వెనక్కినెట్టిన స్మిత్

ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ యాషెస్ సీరిస్ లో అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట వున్న పలు రికార్డులను బద్దలుగొడుతున్నాడు.  

కేసీఆర్ కు రుణపడి ఉంటా, న్యాయం చేస్తారని ఆశిస్తున్నా: మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య

తెలంగాణ రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన తనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి సీఎం కేసీఆర్ అంటూ స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి పరిమతమైన తనను తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాజన్నగా పరిచయం చేసింది కేసీఆర్ అని స్పష్టం చేశారు. 

తాడోపేడో తేల్చుకుంటాం, వదిలిపెట్టను: జగన్ సర్కార్ పై చంద్రబాబు గరంగరం

 

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని తెలుగుతమ్ముళ్లకు పిలుపునిచ్చారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు.  
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై  జరుగుతున్న దాడులకు నిరసనగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 

అప్పుడు వరద రాజకీయాలు, ఇప్పుడు హత్యారాజకీయాలా....?: చంద్రబాబుపై మంత్రి మోపిదేవి

జగన్ కు ప్రకృతి కూడా సహకరించడంతో ఎక్కడ తన ఉనికిని కోల్పోతానో అన్న భయంలో చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ఆందోళనలో ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చూసి తట్టుకోలేక కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. ఇటీవలే వరద రాజకీయాలకు తెరలేపారని అవి ఫెయిల్ కావడంతో తాజాగా హత్యా రాజకీయాలకు తెరలేపారని స్పష్టం చేశారు.  

కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలో షార్ట్‌ సర్క్యూట్: భయంతో పరుగులు తీసిన రోగులు

 

కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో మంగళవారం నాడు షార్ట్‌ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి.భయంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది పరుగులు తీశారు.మంగళవారం నాడు ఉదయం చిన్న పిల్లల వార్డులో  షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు వచ్చాయి. దీంతో  భయంతో రోగులు బయటకు పరుగెత్తారు. మరో వైపు ఈ వార్డులో ఉన్న చిన్నపిల్లలను మరో వార్డులకు తరలించారు.

చంద్రబాబు దంపతులపెళ్లిరోజు: ట్విట్టర్ లో లోకేష్ గ్రీటింగ్స్

: చంద్రబాబునాయుడు, భువనేశ్వరీ పెళ్లి రోజును పురస్కరించుకొని టీడీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేసి తన శుభాకాంక్షలు తెలిపారు.

 

సరస్వతి భూముల కోసమే నాపై కేసులు: అజ్ఞాతం వీడిన యరపతినేని

సరస్వతి సిమెంట్ భూముల  కోసమే తనపై కేసులు పెట్టారని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు.ఎట్టకేలకు గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అజ్ఞాతం వీడారు.

 

 

నా భర్తకు మంత్రి పదవి రాకపోవడం బాధగా ఉంది: జోగు భార్య రమ

మంత్రి పదవి రాకపోవడంతో తన భర్తకు బీపీ ఎక్కువైందన్నారు. తన భర్త అజ్ఞాతంలోకి వెళ్లడం చాలా బాధగా ఉందన్నారు.అధిష్టానం ఆదేశాల మేరకు తాము నడుచుకొంటామని ఆమె చెప్పారు. 2014 నుండి 2018 వరకు కేసీఆర్ మంత్రివర్గంలో జోగు రామన్న అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ దఫా కేసీఆర్ మంత్రివర్గంలో జోగు రామన్నకు మంత్రి పదవి దక్కలేదు.

 

 

కవిత ఓటమి ఎఫెక్ట్: కేసీఆర్‌పై సురేష్ రెడ్డి అసంతృప్తి

మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి టీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ నేతలు ఇచ్చిన హామీని అమలు చేయలేదని సురేష్ రెడ్డి వర్గం అసంతృప్తితో ఉంది.నిజామాబాద్ జిల్లాలో సురేష్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరడం ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి తీరని షాక్. అయితే ఆ సమయంలో కీలకమైన పదవిని కట్టబెడతామని టీఆర్ఎస్ నాయకత్వం సురేష్ రెడ్డికి హామీ ఇచ్చిందని సమాచారం.

 

 

కుటుంబసభ్యులకు టచ్‌లోకి వచ్చిన జోగు రామన్న

మాజీ మంత్రి జోగు రామన్న కుటుంబసభ్యులకు అందుబాటులోకి వచ్చారు.అనారోగ్యం కారణంగానే  అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా ఆయన సమాచారం ఇచ్చారు.సోమవారం రాత్రి నుండి మాజీ మంత్రి జోగు రామన్న  కార్యకర్తలకు కూడ అందుబాటులో లేకుండా వెళ్లిపోయాడు.  కేబినెట్ లో బెర్త్ దక్కని కారణంగానే జోగు రామన్న కుటుంబసభ్యులకు కూడ చెప్పకుండానే వెళ్లిపోయాడని ప్రచారం సాగింది. 

 

 

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: నిరసనగళం విన్పిస్తున్న అసంతృప్తి వాదులు

కేబినెట్ లో చోటు దక్కని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక్కొక్కరుగా తమ మనసులోని మాటలను వెళ్లగక్కుతున్నారు. మాజీ మంత్రి నాయిని నర్సింహరెడ్డి కేసీఆర్  మాట నిలుపుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో మాజీ మంత్రి జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లాడు.మరికొందరు నేతలు కూడ తమ నిరసనను బయట పెడుతున్నారు.

 

 

అమ్మో మేం వెళ్లం: పాక్ పర్యటనను బహిష్కరించిన లంక క్రికెటర్లు

అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో షాక్ తగిలింది. త్వరలో జరగాల్సిన పాక్ పర్యటనను 10 మంది శ్రీలంక క్రికెటర్లు బహిష్కరించారు. భద్రతా కారణాల రీత్యా పాక్ వెళ్లేందుకు వారు ససేమిరా అంటున్నారు

 

20వ సారి గర్భం దాల్చిన మహిళ: షాకైన డాక్టర్లు

ప్రస్తుత రోజుల్లో ఒకసారి గర్భం దాల్చేందుకే మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి ఓ మహిళ 20వ సారి గర్భం దాల్చడం మహారాష్ట్రంలో సంచలనం సృష్టించింది. బీడ్ జిల్లా మజల్‌గావ్ తహసీల్ పరిధిలోని సంచార గోపాల్ జాతికి చెందిన లంకాబాయి ఖరత్ అనే మహిళ 20వ సారి గర్భం దాల్చింది. 

 

ముల్లును ముల్లుతోనే..: కేసీఆర్ పై బిజెపి ప్రత్యేక వ్యూహం ఇదే...

ముల్లును ముల్లుతోనే తీయాలనే వ్యూహాన్ని బిజెపి తెలంగాణ ముిఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద ప్రయోగించేందుకు సిద్ధపడింది. ఇందులో భాగంగా ఈటల రాజేందర్ వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలుచుకుంటోంది.

 

బయటివారికి శ్రీవారి దర్శనాలు: ఎమ్మెల్సీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన టీటీడీ

తిరుమలలో దళారులకు చెక్ పెట్టేందుకు టీటీడీ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా ఓ ఎమ్మెల్సీతో పాటు చెన్నైకి చెందిన ఓ మాజీ సలహామండలి సభ్యుడిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. ప్రోటోకాల్ దర్శనాలను వీరు దుర్వినియోగం చేస్తున్నట్లుగా టీటీడీ అంతర్గత విచారణలో బయటపడింది. దీంతో వీరి పేర్లను బ్లాక్ లిస్ట్‌లోకి చేర్చింది

 

వైసీపీ బాధితుల తరలింపుకు యత్నం: బాబు వస్తేనే కదులుతామంటున్న జనం

అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో పోలీస్ శాఖ స్పందించింది. ఆర్డీవో, అదనపు ఎస్పీ పునరావాస కేంద్రాలకు వెళ్లి.. బాధితులకు అండగా నిలుస్తామని ప్రకటించారు. అయినప్పటికీ టీడీపీ శ్రేణులు బెట్టు వీడకపోవడంతో మంగళవారం మరోసారి పోలీసులు చర్చలు జరిపారు. బాధితులను పోలీస్ భద్రత మధ్య స్వగ్రామాలకు తరలించేందుకు అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేశారు.

 

కాణిపాకం వినాయకుని ఆలయం వద్ద అగ్నిప్రమాదం (వీడియో)

చిత్తూరు జిల్లాలోని ప్రఖ్యాత కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయానికి సమీపంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. దేవస్థానం ప్రాంగణానికి దగ్గరలో ఉన్న జై గణేశ్ హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. క్షణాల్లో బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. 

 

ఏదైనా పదవి ఇస్తే చేస్తా.. లేదంటే ఫారిన్ పోతా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ సందర్భంగా అసంతృప్త నేతలు బహిరంగంగానే తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికీ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. తాజాగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు

 

వేడెక్కిన పల్నాడు: టీడీపీకి పోటీగా.. రేపు వైసీపీ చలో ఆత్మకూరు

పల్నాడులో రాజకీయాలు మరింత వేడెక్కాయి. తెలుగుదేశం పార్టీకి పోటీగా వైఎస్సార్ కాంగ్రెస్ బుధవారం చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పల్నాడులో ఏదో జరిగిపోతోందని టీడీపీ గగ్గోలు పెడుతోందని మండిపడ్డారు. 

 

 

click me!