హైదరాబాద్: కేబినెట్ లో చోటు దక్కని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక్కొక్కరుగా తమ మనసులోని మాటలను వెళ్లగక్కుతున్నారు. మాజీ మంత్రి నాయిని నర్సింహరెడ్డి కేసీఆర్  మాట నిలుపుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో మాజీ మంత్రి జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లాడు.మరికొందరు నేతలు కూడ తమ నిరసనను బయట పెడుతున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు ఆరుగురితో మంత్రివర్గాన్ని విస్తరించారు. కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లకు కేబినెట్ లో చోటు దక్కింది.

మంత్రివర్గంలో చోటు దక్కని వారంతా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. మాజీ మంత్రులు  నాయిని నర్సింహ్మారెడ్డి, జోగురామన్న, రాజయ్యలు తమ అసంతృప్తిని మీడియా ముందు పెట్టారు.

సీఎం కేసీఆర్ తనకు ఇచ్చిన హామీని అమలు చేయలేదని మాజీ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి చెప్పారు. తనకు మంత్రి పదవి ఇస్తానని, తన అల్లుడికి ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చాడని ఆయన చెప్పారు. తనకు ఇచ్చిన హామీని కేసీఆర్ నిలుపుకోలేదన్నారు. సోమవారం నాడు శాసనమండలి లాబీల్లో మీడియాతో నాయిని నర్సింహ్మారెడ్డి చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటే కేసీఆర్ వద్దని తనను వారించిన విషయాన్ని నాయిని నర్సింహ్మారెడ్డి గుర్తు చేశారు. హోం మంత్రిగా పనిచేసినా తనకు ఆర్టీసీ ఛైర్మెన్ పదవి ఇస్తే తీసుకొంటానా అని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీఛైర్మెన్ పదవిలో రసం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక మరో మాజీ మంత్రి జోగు రామన్న కూడ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి గెలిచిన గంగుల కమలాకర్ కు కేసీఆర్ చోటు కల్పించారు. 

ఇదే సామాజిక వర్గానికి చెందిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన దాస్యం వినయ్ భాస్కర్ కు ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని కట్టబెట్టారు. గత టర్మ్ లో జోగు రామన్నకు కేసీఆర్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. అటవీశాఖ మంత్రిగా జోగు రామన్న కొనసాగారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి గత టర్మ్ లో ఇంద్రకరణ్ రెడ్డి,జోగు రామన్నలు కొనసాగారు. రెండో దఫా ఇంద్రకరణ్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది. కానీ, జోగు రామన్నకు మాత్రం మంత్రి పదవి దక్కలేదు.

దీంతో మంత్రి పదవి రాకపోవడంతో జోగు రామన్న సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసుకొని ఎక్కడికో వెళ్లిపోయారని కుటుంబసభ్యులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పార్టీలోని రెండు వర్గాలు సోమవారం నాడు రాత్రి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జోగు రామన్న ఇంటి వద్ద ఘర్షణకు దిగాయి.

మాజీ డిప్యూటీసీఎం రాజయ్య కూడ మంత్రివర్గ కూర్పు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. తొలిసారి సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో రాజయ్య డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అయితే ఆయన పనితీరు నచ్చక రాజయ్యను మంత్రివర్గం నుండి సీఎం కేసీఆర్ తొలగించారు. ఆయన స్థానంలో కడియం శ్రీహరిని డిప్యూటీసీఎంగా నియమించారు.

రాష్ట్ర కేబినెట్ లో మాదిగలకు చోటు దక్కకపోవడం పట్ల రాజయ్య తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 11 నుండి 12 శాతం జనాభా మాదిగలు ఉంటారు. అయితే ఈ వర్గానికి కేబినెట్ లో చోటు లేకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతోందన్నారు. ఏపీలో మాల, తెలంగాణలో మాదిగ సామాజికవర్గాలు గణనీయసంఖ్యలో ఉంటారని రాజయ్య గుర్తు చేశారు.

ఈ విషయాన్ని ప్రత్యర్థులు లేవనెత్తేనాటికంటే ముందే పార్టీలో ఎవరైనా ఈ సమస్య గురించి చర్చించాల్సిన అవసరం  ఉందని రాజయ్య అభిప్రాయపడ్డారు. సోమవారం నాడు అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు  కూడ కేబినెట్ లో చోటు దక్కకపోవడంపై అసంతృప్తితో ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అజ్ఞాతంలోకి మాజీమంత్రి జోగు రామన్న, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ : మంత్రి పదవి దక్కకపోవడంపై అలక..?

కేసీఆర్ కు గులాబీ ఓనర్ల చిక్కు: హరీష్ రావుతో ఈటల రాజేందర్ కు చెక్

మంత్రి ఈటల రాజేందర్ కు షాక్: బిఎసి నుంచి తొలగింపు

ఆ పదవి నేను చేస్తానా: కేసీఆర్‌కి నాయిని నర్సింహారెడ్డి సెగ

ముంచుకొస్తున్న ముప్పు: మంత్రివర్గ విస్తరణపై మారిన కేసీఆర్ ప్లాన్

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

హరీష్ కు మంత్రిపదవి: కేసీఆర్ కు తప్పలేదా, వ్యూహమా?

హరీష్‌కు పెద్దపీట: కొత్త మంత్రుల శాఖలివే

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలిసారి కేబినెట్‌లోకి

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలుత హరీష్, చివరగా పువ్వాడ

టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్: రికార్డుల విజేత హరీష్ రావు

భర్త మరణంతో రాజకీయాల్లోకి.. మూడోసారి మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి

టీఆర్ఎస్‌లో కీలకనేతగా కేటీఆర్: మెడిసిన్‌ కాదని ఐటీ వైపు

బీజేపీ దూకుడు: చెక్ పెట్టే దిశగా కేసీఆర్ ప్లాన్ ఇదీ..

బెర్త్ ఖరారైన అభ్యర్థులకు ఫోన్ కాల్స్: హరీష్ ఉన్నా కేసీఆర్ తర్వాత కేటీఆరే

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....