Asianet News TeluguAsianet News Telugu

మమ్మల్ని చంపేస్తారా, రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తారా: నీ అధికారం అంతు చూస్తానంటూ చంద్రబాబు ఆగ్రహం

సీఎం జగన్ చెబితే మమ్మల్ని చంపేస్తారా అంటూ పోలీసులను నిలదీశారు చంద్రబాబు. అందర్నీ చంపి రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తారా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ చట్ట వ్యతిరేక పార్టీ కాదని పోలీసులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. 
 

tdp president chandrababu naidu serious comments on ysrcp government, babu demands for Home Minister apology
Author
Guntur, First Published Sep 10, 2019, 9:29 PM IST

గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపు ప్రభుత్వమంటూ నిప్పులు చెరిగారు. తన రాజకీయ జీవితంలో ఇంతటి దుర్మార్గపు పాలనను ఎన్నడూ చూడలేదని విమర్శించారు.  

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడతారా అంటూ చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ దాడులను ప్రజలకు తెలియజేయాలని నిరసనకు పిలుపునిస్తే దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారా అంటూ నిప్పులు చెరిగారు. 

ఈ సందర్భంగా పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. సీఎం జగన్ చెబితే మమ్మల్ని చంపేస్తారా అంటూ పోలీసులను నిలదీశారు చంద్రబాబు. అందర్నీ చంపి రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తారా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ చట్ట వ్యతిరేక పార్టీ కాదని పోలీసులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. 

సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులకు పోలీసులు అరెస్ట్ లు చేసి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అమాయకులపై కేసులు పెట్టి వేధించడం కాదని వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసును చేధించండి అంటూ సవాల్ విసిరారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పదిమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను హత్య చేశారంటూ చంద్రబాబు ఆరోపించారు. పలువురిపై అక్రమకేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఆత్మకూరులో 127 కుటుంబాలను గ్రామం నుంచి తరిమివేశారని ఆరోపించారు. వైసీపీ బాధితులు స్వగ్రామంలో నివసించే హక్కు కోసం ‘చలో ఆత్మకూరు’కు పిలుపునిచ్చామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇవి పోలీసులకు కనిపించడం లేదా అంటూ నిలదీశారు. 

వైసీపీ బాధితులు తన వద్దకు వచ్చి కన్నీరు పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తారా అంటూ మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 561 సంఘటనలు చోటు చేసుకోగా వాటిలో 201 దాడులు, 136 వేధింపులు, 52 అక్రమ కేసులు పెట్టాని చంద్రబాబు ఆరోపించారు. 

21 మందిని తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులంటూ ఉద్యోగాల నుంచి తొలగించి వేశారంటూ చంద్రబాబు ఆరోపించారు. 15 భూకబ్జాలు, 65 ఆస్తులను ధ్వంసం చేశారు. 68 మందిపై సోషల్‌ మీడియా కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. 

గుంటూరులో 131 దారుణాలు చోటు చేసుకున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చఏశారు. గుంటూరు జిల్లాలో దాడులపై 110 కేసులు నమోదుకాగా 38 ఘటనల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చెయ్యలేదని విమర్శించారు. 13 ఆస్తుల ధ్వంసం కేసులు నమోదు కాగా ఆరుగురి ఉద్యోగాలు తీసేశారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ దారుణాలు ప్రజలకు తెలియజేసేందుకే వైసీపీ బాధితుల క్యాంప్‌ పెట్టామని అది పెట్టి 8 రోజులు కావస్తున్నా మీకు కనిపించలేదా అని పోలీసులను నిలదీశారు. ఇప్పుడు వచ్చి బాధితుల్ని తీసుకెళ్తామంటారా?. వారికి ఎలాంటి రక్షణ కల్పిస్తారో చెప్తారా అంటూ ప్రశ్నించారు. 

పోలీసులకు ఎందుకు ఇంత బేషజాలకు పోతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైయస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన వాళ్లని ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదో చెప్పాలని నిలదీశారు. మీ ప్రతాపం అంతా మాపై చూపిస్తారా అంటూ నిప్పులు చెరిగారు. 

వైసీపీ చలో ఆత్మకూరు అంటూ పిలుపు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. ఇది పైశాచిక, రాక్షస ఆనందం తప్ప మరోకటి కాదన్నారు. హోంమంత్రి, పోలీసులు పద్ధతిగా వ్యవహరించాలని చంద్రబాబు నాయుడు హితవు పలికారు. 
 
పెయిడ్ ఆర్టిస్టులు అన్నందుకు సుచరిత క్షమాపణలు చెప్పాలి: చంద్రబాబు

రాష్ట్రహోంశాఖ మంత్రి మేకతోటి సుచరితపై మండిపడ్డారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడుల వివరాలు బయటపెడితే పెయిడ్ ఆర్టిస్టులంటూ ఎగతాళిగా మాట్లాడిన హోంమంత్రి సుచరిత బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

హోంమంత్రి నియోజకవర్గంలోనే రోడ్డుకు అడ్డంగా గోడ కడతారా?. గోడ తీయించాల్సిన బాధ్యత హోంమంత్రికి లేదా అంటూ ప్రశ్నించారు. రక్షణ కోసం వస్తే రాక్షసత్వంగా ప్రశ్నిస్తారా అంటూ నిలదీశారు. తెలుగుదేశం పార్టీ నేతలు, బీజేపీ నాయకులు వస్తుంటే 144 సెక్షన్‌ పెడతున్నారని వైసీపీ నాయకులకు మాత్రం అది వర్తించడం లేదని మండిపడ్డారు. 

సేవ్‌ పల్నాడు పేరుతో సీఎం, హోంమంత్రి ఫొటోలు పెట్టుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవ్ పల్నాడు పేరుతో వైసీపీ ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తుంటే చలో ఆత్మకూరు బాధితుల గోడు అని స్పష్టం చేశారు. 

బాధితుల గోడు వినే నాథుడే లేడుని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమలో చీని చెట్లు నరికి టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం సరికాదన్నారు. రాజానగరం ఎమ్మెల్యే కబ్జాను అడ్డుకున్నందుకు దాడి చేస్తారా అంటూ నిప్పులు చెరిగారు. 

వైసీపీ ప్రభుత్వంపై రెండు పుస్తకాలను విడుదల చేసిన చంద్రబాబు

వైసీపీ నాయకులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. చలో ఆత్మకూరు ప్రోగ్రామ్ లో ఆబోతుల్లా విరుచుకుపడతారేమో అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అరాచకాలపై రెండు పుస్తకాలు విడుదల చేసినట్లు చంద్రబాబు తెలిపారు. నాగరిక ప్రపంచంలో అనాగరిక పాలన, పులివెందుల ఫ్యాక్షనిజం గుప్పిట్లో రాష్ట్ర పాలన పేరుతో రెండు పుస్తకాలను విడుదల చేసినట్లు చంద్రబాబు  తెలిపారు. 

ఆ పుస్తకాల్లో దాడులు, కేసుల వివరాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వైసీపీ అరాచకపాలనకు చరమగీతం పాడేందుకే ఈ పోరాటం చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. అప్రజాస్వామిక పాలనపై రాజీలేని పోరాటం చేస్తున్నామని అందుకు అంతా కలిసి రావాలని కోరారు. 

తటస్థులు, మేధావులు, ప్రజాస్వామ్య వాదులు బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చారు. తాము చేసే పోరాటానికి కలిసి రావాలని, మద్దతుగా నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.   

ఈ వార్తలు కూడా చదవండి

గతంలో నన్ను అరెస్ట్ చేయలేదా...? చంద్రబాబు మీ జిమ్మిక్కులు తెలుసు: బొత్స సత్యనారాయణ ఫైర్

చదువుకున్న వాళ్లకే కులపిచ్చి, జమిలి ఎన్నికలకు ఛాన్స్: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

తాడోపేడో తేల్చుకుంటాం, వదిలిపెట్టను: జగన్ సర్కార్ పై చంద్రబాబు గరంగరం
వేడెక్కిన పల్నాడు: టీడీపీకి పోటీగా.. రేపు వైసీపీ చలో ఆత్మకూరు

Follow Us:
Download App:
  • android
  • ios