Asianet News TeluguAsianet News Telugu

చదువుకున్న వాళ్లకే కులపిచ్చి, జమిలి ఎన్నికలకు ఛాన్స్: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎంతో ఆశించానని కానీ అలా జరగలేదన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం నంబర్ వన్ అని తేలడంతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమనుకున్నామని తెలిపారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సమ్ థింగ్ ఐయామ్ మిస్సింగ్ అని గ్రహించినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. 
 
ex cm chandrababu naidu interesting comments at tdp legal cell meeting
Author
Guntur, First Published Sep 10, 2019, 4:24 PM IST

గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు చదువుకున్న వాళ్లకు కులపిచ్చి ఎక్కువగా ఉందని ఆరోపించారు. అది చాలా బాధాకరమన్నారు. కుల రహిత సమాజం కోసం పోరాడాల్సింది పోయి కుల రాజకీయాలు చేయడం దురదృష్టకరమన్నారు.

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎంతో ఆశించానని కానీ అలా జరగలేదన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం నంబర్ వన్ అని తేలడంతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమనుకున్నామని తెలిపారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సమ్ థింగ్ ఐయామ్ మిస్సింగ్ అని గ్రహించినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. 

ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రివర్స్ టెండర్ల వల్ల రాష్ట్రం ఏమైపోతుందోనన్న ఆందోళన కలుగుతుందన్న కలుగుతుందన్నారు. రాష్ట్రంలో రివర్స్ పాలన జరుగుతుందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు విసుగెత్తిపోయారని చెప్పుకొచ్చారు. 

ప్రజలు రివర్స్ ఎన్నికలు కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రివర్స్ పాలన కొనసాగుతున్నా రివర్స్ ఎన్నికలు వచ్చే ఆస్కారం లేదన్నారు. కానీ జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. జమిలి ఎన్నికలు వస్తే రాబోయే మూడు సంవత్సరాల్లో వచ్చే ఛాన్స్ ఉందన్నారు చంద్రబాబు నాయుడు. 

ఈ వార్తలు కూడా చదవండి

తాడోపేడో తేల్చుకుంటాం, వదిలిపెట్టను: జగన్ సర్కార్ పై చంద్రబాబు గరంగరం
వేడెక్కిన పల్నాడు: టీడీపీకి పోటీగా.. రేపు వైసీపీ చలో ఆత్మకూరు

Follow Us:
Download App:
  • android
  • ios