ప్రస్తుత రోజుల్లో ఒకసారి గర్భం దాల్చేందుకే మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి ఓ మహిళ 20వ సారి గర్భం దాల్చడం మహారాష్ట్రంలో సంచలనం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే.. బీడ్ జిల్లా మజల్‌గావ్ తహసీల్ పరిధిలోని సంచార గోపాల్ జాతికి చెందిన లంకాబాయి ఖరత్ అనే మహిళ 20వ సారి గర్భం దాల్చింది. అలాగే ఇప్పటి వరకు 16 సార్లు ప్రసవం జరిగ్గా.. మూడుసార్లు గర్భస్రావమైంది.

ప్రతికాన్పులోనూ ఒకే సంతానాన్ని పొందిన ఆమెకు ఐదుసార్లు శిశువులు పుట్టిన కొన్ని గంటలు లేదా రోజుల్లో మరణించారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణీ.. ఇప్పటి వరకు ఇంటి దగ్గరే పురుగు పోయించుకున్న ఆమె.. తొలిసారి ఆస్పత్రిలో డెలీవరి చేయించుకునేందుకు సిద్ధమయింది.

17వ సారి సైతం లంకాబాయికి విజయవంతంగా పురుడు పోసేందుకు బీడ్ జిల్లా వైద్యశాఖ ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు జరిపిన పరీక్షల్లో తల్లీ, గర్భంలోని బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు తేలిందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు 11 మంది సంతానం.