హైదరాబాద్: మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో  అసంతృప్తికి గురైన పార్టీ ప్రజా ప్రతినిధులకు టీఆర్ఎస్ నాయకత్వం బుజ్జగింపులకు దిగింది. మంత్రి పదవి దక్కకోపవడంతో కొందరు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. దీంతో  పార్టీ నాయకత్వం హుటాహుటిన రంగంలోకి దిగింది.

ఈ నెల 8వ తేదీన కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించారు. ఆరుగురిని  మంత్రివర్గంలోకి తీసుకొన్నారు. మంత్రిపదవి దక్కని ప్రజా ప్రతినిధులు  అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి పదవి దక్కకపోవడంతో మాజీ మంత్రులు నాయిని నర్సింహ్మరెడ్డి, రాజయ్య,  జోగు రామన్నలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీలాబీల్లో మీడియాతో చిట్ చాట్ చేసే సమయంలో  తమ అసంతృప్తిని ప్రజా ప్రతినిధులు వ్యక్తం చేశారు.

మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, బాజిరెడ్డి గోవర్ధన్, జోగు రామన్నలకు టీఆర్ఎస్ నాయకత్వం బుజ్జగింపులకు దిగింది. పార్టీ సీనియర్ నేతలు వీరితో ఫోన్లో మాట్లారు. భవిష్యత్తులో కీలకమైన పదవులను కట్టబెడతామని టీఆర్ఎస్ నాయకత్వం అసంతృప్త నేతలకు హామీ ఇచ్చినట్టుగా సమాచారం.

ఈ హామీ నేపథ్యంలోనే కొందరు నేతలు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తోంది. మంగళవారం నాడు మధ్యాహ్నం మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య టీఆర్ఎస్ కార్యాలయంలోనే మీడియాతో మాట్లాడారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

మరో వైపు మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తికి గురైనట్టుగా తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సాగుతోందని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అసంతృప్తిగా ఉన్న నేతలందరితో సోమవారం రాత్రి నుండే టీఆర్ఎస్ నాయకత్వం ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆపార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు
లోక్‌సభ ఫలితాల ఎఫెక్ట్: కరీంనగర్‌పై కేసీఆర్ ప్రత్యేక దృష్టి

కేసీఆర్ కు రుణపడి ఉంటా, న్యాయం చేస్తారని ఆశిస్తున్నా: మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: నిరసనగళం విన్పిస్తున్న అసంతృప్తి వాదులు

అజ్ఞాతంలోకి మాజీమంత్రి జోగు రామన్న, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ : మంత్రి పదవి దక్కకపోవడంపై అలక..?

కేసీఆర్ కు గులాబీ ఓనర్ల చిక్కు: హరీష్ రావుతో ఈటల రాజేందర్ కు చెక్

మంత్రి ఈటల రాజేందర్ కు షాక్: బిఎసి నుంచి తొలగింపు

ఆ పదవి నేను చేస్తానా: కేసీఆర్‌కి నాయిని నర్సింహారెడ్డి సెగ

ముంచుకొస్తున్న ముప్పు: మంత్రివర్గ విస్తరణపై మారిన కేసీఆర్ ప్లాన్

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

హరీష్ కు మంత్రిపదవి: కేసీఆర్ కు తప్పలేదా, వ్యూహమా?

హరీష్‌కు పెద్దపీట: కొత్త మంత్రుల శాఖలివే

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలిసారి కేబినెట్‌లోకి

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలుత హరీష్, చివరగా పువ్వాడ

టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్: రికార్డుల విజేత హరీష్ రావు

భర్త మరణంతో రాజకీయాల్లోకి.. మూడోసారి మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి

టీఆర్ఎస్‌లో కీలకనేతగా కేటీఆర్: మెడిసిన్‌ కాదని ఐటీ వైపు

బీజేపీ దూకుడు: చెక్ పెట్టే దిశగా కేసీఆర్ ప్లాన్ ఇదీ..

బెర్త్ ఖరారైన అభ్యర్థులకు ఫోన్ కాల్స్: హరీష్ ఉన్నా కేసీఆర్ తర్వాత కేటీఆరే

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....