కరీంనగర్: పోగోట్టుకొన్న చోటే వెతుక్కోవాలి అనేది నానుడి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు టీఆర్ఎస్ కార్యాచరణను ప్రారంభించింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ స్థానంలో టీఆర్ఎస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.దీంతో కేసీఆర్ కరీంనగర్ జిల్లాపై ప్రత్యేక దృష్టిని పెట్టారు.

ఈ ఏడాది ఏప్రిల్  మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఈ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.

టీఆర్ఎస్‌కు గుండెకాయ లాంటి  ఉమ్మడి కరీంనగర్ ఎంపీ స్థానంలో బీజేపీ విజయం సాధించడం టీఆర్ఎస్ నాయకత్వాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఇదే జిల్లాకు చెందిన మంత్రి ఈటల రాజేందర్,  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు కూడ సంచలనం కల్గించాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేశారు. ఎంపీ ఎన్నికల్లో ఓటమి పాలైన బోయినపల్లి వినోద్ కుమార్ కు ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మె్న్ పదవిని ఇచ్చారు. ఆయనకు కేబినెట్ ర్యాంకు హోదా ఇచ్చారు.

మరో వైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి గతంలో ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్  లు మంత్రులుగా ఉన్నారు..ఎన్నికల ఫలితాల తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మరో ఇద్దరిని మంత్రులుగా కేసీఆర్ గా తీసుకొన్నారు.

ఈ నెల 8వ తేదీన జరిగిన మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్, గంగుల కమలాకర్ లకు కేసీఆర్ చోటు కల్పించారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి  ప్రస్తుతం నలుగురు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది ఐదేళ్లలో  అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు బీజేపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కూడ టీఆర్ఎస్‌కు చుక్కలు చూపించాయి.

దీంతో టీఆర్ఎస్ నాయకత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకొంది. బీజేపీ నుండి వచ్చే సవాల్‌కు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నాడు. కరీంనగర్‌ అసెంబ్లీ స్థానంలో ఓటమి పాలైన బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించాడు.

గతంలో కరీంనగర్ ఎంపీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా విద్యాసాగర్ రావు పోటీ చేసి విజయం సాధించాడు. ఇదే స్థానం నుండి విద్యాసాగర్ రావు పోటీ చేసి ఓటమి పాలైన సందర్భాలు కూడ ఉన్నాయి.

బీజేపీ నాయకత్వం కూడ తెలంగాణపై కేంద్రీకరించింది. దీంతో రానున్న రోజులను దృష్టిలో ఉంచుకొని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రివర్గంలో పెద్దపీట వేశారు.

సంబంధిత వార్తలు

కేబినెట్ విస్తరణ: అసంతృప్తులకు టీఆర్ఎస్ బుజ్జగింపులు

కేసీఆర్ కు రుణపడి ఉంటా, న్యాయం చేస్తారని ఆశిస్తున్నా: మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: నిరసనగళం విన్పిస్తున్న అసంతృప్తి వాదులు

అజ్ఞాతంలోకి మాజీమంత్రి జోగు రామన్న, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ : మంత్రి పదవి దక్కకపోవడంపై అలక..?

కేసీఆర్ కు గులాబీ ఓనర్ల చిక్కు: హరీష్ రావుతో ఈటల రాజేందర్ కు చెక్

మంత్రి ఈటల రాజేందర్ కు షాక్: బిఎసి నుంచి తొలగింపు

ఆ పదవి నేను చేస్తానా: కేసీఆర్‌కి నాయిని నర్సింహారెడ్డి సెగ

ముంచుకొస్తున్న ముప్పు: మంత్రివర్గ విస్తరణపై మారిన కేసీఆర్ ప్లాన్

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

హరీష్ కు మంత్రిపదవి: కేసీఆర్ కు తప్పలేదా, వ్యూహమా?

హరీష్‌కు పెద్దపీట: కొత్త మంత్రుల శాఖలివే

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలిసారి కేబినెట్‌లోకి

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలుత హరీష్, చివరగా పువ్వాడ

టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్: రికార్డుల విజేత హరీష్ రావు

భర్త మరణంతో రాజకీయాల్లోకి.. మూడోసారి మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి

టీఆర్ఎస్‌లో కీలకనేతగా కేటీఆర్: మెడిసిన్‌ కాదని ఐటీ వైపు

బీజేపీ దూకుడు: చెక్ పెట్టే దిశగా కేసీఆర్ ప్లాన్ ఇదీ..

బెర్త్ ఖరారైన అభ్యర్థులకు ఫోన్ కాల్స్: హరీష్ ఉన్నా కేసీఆర్ తర్వాత కేటీఆరే

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....