హైదరాబాద్: కేసీఆర్ కేబినెట్ కూర్పుపై కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకున్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారే తప్ప తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు. 

తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన రాజయ్య తెలంగాణ రాష్ట్రంలో తనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి సీఎం కేసీఆర్ అంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని ఎమ్మెల్యే పదవిని సైతం వదులుకున్నానని గుర్తు చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన తనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి సీఎం కేసీఆర్ అంటూ స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి పరిమతమైన తనను తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాజన్నగా పరిచయం చేసింది కేసీఆర్ అని స్పష్టం చేశారు. 

పార్టీ శిక్షణ శిబిరం నాయకత్వ బాధ్యతలు అప్పగించి తనకు ఎంతో గురుతర బాధ్యతను అప్పగించినట్లు చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఆశీస్సులతో తాను రాష్ట్రవ్యాప్తంగా తిరిగానని పలు కీలక సందేశాలు ఇచ్చినట్లు రాజయ్య చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఆశీస్సులతోనే గెలిచినట్లు చెప్పుకొచ్చారు. 

టీఆర్ఎస్ పార్టీలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ 2014లో టీఆర్ఎస్ఎల్పీ నాయకుడిగా కేసీఆర్ ని ప్రతిపాదించే అవకాశం తనకే ఇవ్వడం గొప్ప అదృష్టంగా భావించానని చెప్పుకొచ్చారు. 

అంతేకాదు తాను కలలో కూడా ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్ర తొలిడిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని చెప్పుకొచ్చారు. తనకు అత్యంత ఇష్టమైన వైద్యఆరోగ్య శాఖను కట్టబెట్టడం తనకు ఒక వరమని చెప్పుకొచ్చారు.  
 
వరంగల్ జిల్లాకు కాళోజీ వైద్యవిశ్శవిద్యాలయం ఇవ్వడం తానను ఒక వరంగా భావించినట్లు రాజయ్య చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన నియోజకవర్గంలో చెరువులు నింపేందుకు ఏడు రిజర్వాయర్లు పనులకు పూర్తి చేశారని గుర్తు చఏశారు. 

2018 ఎన్నికల్లో తనకు టికెట్ రాకుండా కొన్ని దృష్టశక్తులు అడ్డుకున్నా వాటిని పట్టించుకోకుండా తనకు అండగా నిలిచిన వ్యక్తులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అని చెప్పుకొచ్చారు. తనకు స్టేషన్ ఘనపూర్ టికెట్ ఇచ్చి తన గెలుపునకు సహకరించారని కొనియాడారు. 
 
తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిన కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలతో ముందుకు వెళ్తానని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఏ అవకాశం ఇచ్చినా దానిని చిత్తశుద్దితో పనిచేస్తానని తెలిపారు.  

అందర్నీ కలుపుకుపోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయమని స్పష్టం చేశారు. వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న మాదిగ సామాజిక వర్గానికి కేసీఆర్ న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఓర్చుకున్నవాడికి ఓర్చుకున్నంత అని వరంగల్ లో ఒక సామెత ఉండేదని గుర్తు చేశారు. మాదిగ బిడ్డలు శాంతంగా ఉండాలని సూచించారు. మాదిగ బిడ్డలు తెలంగాణ ఉద్యమంలో ముఖ్యభూమిక పోషించారని ఆ విషయం కేసీఆర్ కు కూడా తెలుసునన్నారు.  
 

ఈ వార్తలు  కూడా చదవండి

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: నిరసనగళం విన్పిస్తున్న అసంతృప్తి వాదులు

అజ్ఞాతంలోకి మాజీమంత్రి జోగు రామన్న, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ : మంత్రి పదవి దక్కకపోవడంపై అలక..?

కేసీఆర్ కు గులాబీ ఓనర్ల చిక్కు: హరీష్ రావుతో ఈటల రాజేందర్ కు చెక్

మంత్రి ఈటల రాజేందర్ కు షాక్: బిఎసి నుంచి తొలగింపు

ఆ పదవి నేను చేస్తానా: కేసీఆర్‌కి నాయిని నర్సింహారెడ్డి సెగ

ముంచుకొస్తున్న ముప్పు: మంత్రివర్గ విస్తరణపై మారిన కేసీఆర్ ప్లాన్

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

హరీష్ కు మంత్రిపదవి: కేసీఆర్ కు తప్పలేదా, వ్యూహమా?

హరీష్‌కు పెద్దపీట: కొత్త మంత్రుల శాఖలివే

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలిసారి కేబినెట్‌లోకి

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలుత హరీష్, చివరగా పువ్వాడ

టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్: రికార్డుల విజేత హరీష్ రావు

భర్త మరణంతో రాజకీయాల్లోకి.. మూడోసారి మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి

టీఆర్ఎస్‌లో కీలకనేతగా కేటీఆర్: మెడిసిన్‌ కాదని ఐటీ వైపు

బీజేపీ దూకుడు: చెక్ పెట్టే దిశగా కేసీఆర్ ప్లాన్ ఇదీ..

బెర్త్ ఖరారైన అభ్యర్థులకు ఫోన్ కాల్స్: హరీష్ ఉన్నా కేసీఆర్ తర్వాత కేటీఆరే

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....