అమరావతి: చంద్రబాబునాయుడు, భువనేశ్వరీ పెళ్లి రోజును పురస్కరించుకొని టీడీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేసి తన శుభాకాంక్షలు తెలిపారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. ఆనాటి ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరీని చంద్రబాబునాయుడు సరిగ్గా ఇదే రోజున వివాహం చేసుకొన్నారు.

 

చంద్రబాబునాయుడుకు ఆ సమయంలో సినీ దర్శకుడు దాసరి నారాయణరావు అన్ని తానై నడిపాడు. చంద్రబాబునాయుడు ఆ తర్వాత  టీడీపీలో చేరారు. చంద్రబాబునాయుడు ఆయన సతీమణి అమెరికా పర్యటనలో సరదాగా దిగిన ఫోటోను లోకేష్ ట్విట్టర్ లో షేర్ చేశాడు.

భువనేశ్వరీ ఆధునిక దుస్తుల్లో సాధారణం కంటే భిన్నంగా కన్పించారు. నల్ల కళ్లద్దాలను ధరించి చంద్రబాబుతో కలిసి భువనేశ్వరి దిగిన ఫోటోను ఆయన ట్వీట్ చేశారు.