హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపైనా, నేతలపైనా చేస్తున్న వ్యాఖ్యలు సరికాదంటూ హితవు పలికారు మల్లు రవి.

తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియాలను తొలగిస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి మునుగోడు నుంచి గెలవాలని సవాల్ విసిరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ పార్టీ అధిష్టానాన్ని కోరనున్నట్లు మల్లు రవి స్పష్టం చేశారు. 

  ఈ వార్తలు కూడా చదవండి

అలాగైతేనే...: ఉత్తమ్, కుంతియాలపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు