కర్నూల్: కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో మంగళవారం నాడు షార్ట్‌ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి.భయంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది పరుగులు తీశారు.

మంగళవారం నాడు ఉదయం చిన్న పిల్లల వార్డులో  షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు వచ్చాయి. దీంతో  భయంతో రోగులు బయటకు పరుగెత్తారు. మరో వైపు ఈ వార్డులో ఉన్న చిన్నపిల్లలను మరో వార్డులకు తరలించారు.

అయితే అసలు చిన్నపిల్లల వార్డులో షార్ట్‌ సర్క్యూట్  కావడంతో  ఆసుపత్రి వర్గాలు అప్రమత్తమయ్యాయి.