Asianet News TeluguAsianet News Telugu

కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్, సిద్ధం చేస్తున్న బీజేపీ: మాజీ ఎంపీ సంచలనం

మహారాష్ట్ర ఎన్నికల అనంతరం హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని బీజేపీ వ్యూహరచన చేస్తోందని తెలిపారు. రాజ్యసభలో మెజారిటీ కోసం బీజేపీ ఎదురుచూస్తోందని విమర్శించారు. 

ex mp chintha mohan interesting comments on ys jagan
Author
Chittoor, First Published Sep 10, 2019, 5:39 PM IST

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ సక్సెస్ అవ్వాలంటే తూళ్లూరు నుంచి షిఫ్ట్ అవ్వాల్సిందేనని చెప్పుకొచ్చారు మాజీ ఎంపీ చింతామోహన్. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని తూళ్లూరు ప్రాంతం శాపగ్రస్త ప్రాంతమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

జగన్ అక్కడ ఉండటం వల్లే సక్సెస్  కాలేకపోతున్నారని చెప్పుకొచ్చారు. నవ్యాంధ్ర రాజధానిగా తిరుపతి సరైన ప్రాంతమని చెప్పుకొచ్చారు. అమరావతి రాజధాని మారిస్తే తిరుపతిని ఎంపిక చేయాలని చింతా మోహన్ సూచించారు. 

మరోవైపు హైదరాబాద్ పైనా కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ చింతా మోహన్. మహారాష్ట్ర ఎన్నికల అనంతరం హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని బీజేపీ వ్యూహరచన చేస్తోందని తెలిపారు. రాజ్యసభలో మెజారిటీ కోసం బీజేపీ ఎదురుచూస్తోందని విమర్శించారు. 

మరోవైపు ప్రధాని నరేంద్రమోదీపైనా విమర్శలు గుప్పించారు. రాయలసీమ ప్రజలు కరువు కాటకాలతో అలమటిస్తుంటే ప్రధాని మోదీ రష్యాలోని పేదల కోసం రూ.7వేల కోట్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాయలసీమ ప్రాంతాన్ని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని మాజీ ఎంపీ చింతా మోహన్ డిమాండ్ చేశారు.   
 

Follow Us:
Download App:
  • android
  • ios