చిత్తూరు జిల్లాలోని ప్రఖ్యాత కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయానికి సమీపంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. దేవస్థానం ప్రాంగణానికి దగ్గరలో ఉన్న జై గణేశ్ హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. క్షణాల్లో బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి.

"

హోటల్‌లోని నెయ్యి డబ్బాలకు మంటలు అంటుకోవడంతో మంటలు మరింత తీవ్రమయ్యాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

"

హోటల్‌లో ఉన్న గ్యాస్ సీలిండర్లను బయటకు తరలించారు. ఈ సంఘటనతో భక్తులు, పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు.