తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

12:01 AM (IST) May 30
Punjab Kings IPL 2025 : క్వాలిఫైయర్-1లో ఆర్సీబీ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓడిపోయినా, ఐపీఎల్ 2025 నుండి ఇంకా అవుట్ కాలేదు. ఆ పంజాబ్ కింగ్స్ కు ఇంకా టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
11:45 PM (IST) May 29
RCB: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1లో పంజాబ్ పై విక్టరీతో ఆర్సీబీ ఫైనల్ లోకి ప్రవేశించింది. అయితే, ప్రత్యర్థి జట్టు ఏదైనా సరే ఐపీఎల్ 2025 ట్రోఫీని ఆర్సీబీ గెలుస్తుందని ఒక లెజెండరీ ప్లేయర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
11:29 PM (IST) May 29
Reliance Jio: రిలయన్స్ జియో కంపెనీ రూ.198 ధరకే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్ పూర్తి వివరాలను తెలుసుకుందాం రండి.
11:14 PM (IST) May 29
Suyash Sharma: విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ నాలుగో సారి ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది. ఆర్సీబీ లెగ్‌స్పిన్నర్ సుయాష్ శర్మ ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో మూడు కీలక వికెట్లు తీసి పంజాబ్ కింగ్స్‌ను దెబ్బకొట్టాడు.
11:06 PM (IST) May 29
మందుబాబులకు మత్తెక్కించే వార్త ఇది. త్వరలో విస్కీ ధరలు తగ్గనున్నాయి. ఈ విషయాన్ని ఇండియాలో మద్యం వ్యాపారం చేసే ఫ్రాన్స్ కంపెనీయే స్వయంగా వెల్లడించింది. ఎందుకు ధరలు తగ్గుతున్నాయో తెలుసుకుందాం రండి.
10:27 PM (IST) May 29
26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025 లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. గురువారం మన అథ్లెట్లు ఎన్ని పతకాలు సాధించారో తెలుసా?
10:09 PM (IST) May 29
PBKS vs RCB Qualifier 1 IPL 2025: ఐపీఎల్ 2025 టైటిల్ కు ఆర్సీబీ మరింత దగ్గరైంది. ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ ను ఓడించింది.
09:41 PM (IST) May 29
Gautam Gambhir on Shreyas Iyer: ఇంగ్లాండ్ టెస్ట్‌లకు శ్రేయస్ అయ్యర్‌ను బీసీసీఐ భారత జట్టు నుంచి తప్పించింది. దీనిపై టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ను ప్రశ్నించగా.. ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
09:30 PM (IST) May 29
బాలీవుడ్ లో భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న రామాయణం సినిమా గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. రీసెంట్ గా ఈమూవీ నుంచి ఓ కొత్త ఫోటో వైరల్ అవుతోంది. ఆ ఫోటోతో పాటు ఓ కొత్త విషయం కూడా బయటకు వచ్చింది. అదేంటంటే?
09:29 PM (IST) May 29
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మీకు అన్ని అర్హతలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకొండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
09:25 PM (IST) May 29
PBKS vs RCB Qualifier 1 IPL 2025: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ల అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ 14.1 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మలు చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
08:57 PM (IST) May 29
ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత ఉద్రిక్తతల వేళ భారత్ తమ భూభాగంలో క్షిపణులతో దాడి చేసిందని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నారు. భారత్ దాడులపై ఆయన ఏమన్నారంటే..
08:29 PM (IST) May 29
PBKS vs RCB Qualifier 1 IPL 2025: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ టీమ్ మొదట బ్యాటింగ్ కు దిగింది.
08:21 PM (IST) May 29
దేశానికి ఉగ్రవాదులు ఎంత ప్రమాదకరమో రాజకీయ ముసుగులో దాగివుండే ఆర్థిక ఉగ్రవాదులు కూడా సమాజానికి చాలా ప్రమాదకరమని చంద్రబాబు అన్నారు. అందుకోసమే ఆపరేషన్ సిందూర్ స్పూర్తితో ఏపీలో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ చేపడామని చంద్రబాబు అన్నారు.
07:31 PM (IST) May 29
పాకిస్తాన్, బంగ్లాదేశ్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకునే చైనా ప్రజల సంఖ్య పెరుగుతోంది. దీనిపై చైనా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇంతకీ చైనా యువత ఆ దేశాల వారిని ఎందుకు వివాహం చేసుకుంటున్నారంటే.
07:25 PM (IST) May 29
మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా పోలీసులకు చిక్కాడు. ఇది మావోయిస్టులకు మరో చావుదెబ్బ అని చెప్పాలి.
07:16 PM (IST) May 29
IPL 2025 Qualifier 1 RCB vs PBKS: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్ టాస్ పడింది. మ్యాచ్ ను గెలిచేది ఎవరు?
07:09 PM (IST) May 29
ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఇండియాలో సాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రారంభించనుంది. బేసిక్ ప్లాన్ నెలకు రూ.850 కంటే తక్కువ ఉంటుందని సమాచారం. లాంచ్ ఆఫర్‌లో అన్‌లిమిటెడ్ డేటా కూడా ఉండవచ్చు. స్టార్ లింక్ ఇంకా ఎలాంటి ఆఫర్లు ఇస్తోందో తెలుసుకుందాం రండి.
07:01 PM (IST) May 29
పహల్గామ్ దాడుల తర్వాత భారత్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మన దేశంలో ఉంటూ పాకిస్థాన్‌కు సహాయం చేస్తున్నారన్న ఆరోపణలతో ఇప్పటికే అధికారులు పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
06:46 PM (IST) May 29
జనవరి 2025 నుండి దాదాపు 1080 మంది భారతీయులను అమెరికా నిషేధించిందని… వీరిలో 62% మంది వాణిజ్య విమానాల ద్వారా తిరిగి వచ్చారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
06:45 PM (IST) May 29
IPL 2025 Qualifier 1 RCB vs PBKS: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 మ్యాచ్ ముల్లన్‌పూర్‌లో జరుగుతుంది. ఇక్కడి పిచ్, వాతావరణం పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లలో ఏ టీమ్ కు లాభం చేకూరుస్తుంది?
06:15 PM (IST) May 29
గోవాకు ఒక్కసారైనా వెళ్లాలని చాలా మంది ఆశపడుతుంటారు. ముఖ్యంగా యువత ఎక్కువగా గోవాకు ప్రాధాన్యత ఇస్తుంటుంది. అయితే గోవాలో పర్యాటకులకు ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో ప్రయాణం ఒకటి.
06:07 PM (IST) May 29
Punjab kings vs Royal challengers Bengaluru: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. మరి ఇరు జట్ల రికార్డులు గమనిస్తే ఎవరు గెలుస్తారు? ఎవరిది పైచేయి అవుతుంది?
05:39 PM (IST) May 29
ఓవల్ ఆఫీస్ ఒకప్పుడు చారిత్రాత్మక ఒప్పందాలకు వేదిక. ఇప్పుడు టీవీ షో స్టూడియోలా మారింది. ట్రంప్, అతని అనుచరులకు వారి విధానాలు అమలు చేసే వేదికగా మారింది. తాజాగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫాసోను కూడా ట్రంప్ అవమానించారు.
05:34 PM (IST) May 29
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు డిప్యూటీ సీఎంగా ఎంత బిజీగా ఉన్నా.. తనను నమ్ముకున్న నిర్మాతలకోసం పెండింగ్ సినిమాలను కంప్లీట్ చేయడానికి ముందుకు వచ్చాడు. రాత్రీ పగలు కష్టపడుతూ.. సినిమాను పట్టుదలతో కంప్లీట్ చేస్తున్నాడు పవర్ స్టార్.
05:17 PM (IST) May 29
Punjab kings vs Royal challengers Bengaluru: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్, బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. అయితే, ఫైనల్ టికెట్ ఎవరు దక్కించుకుంటారు?
05:15 PM (IST) May 29
కొన్నిసార్లు మనం వేరేవాళ్లను తాకినప్పుడు లేదా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చేతికి షాక్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది. ఇది అందరికీ జరగకపోవచ్చు. కానీ చాలామందికి జరిగే ఉంటుంది. అసలు అలా ఎందుకు జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
05:01 PM (IST) May 29
భారత దేశంలో ఒక చిన్న స్టార్టప్‌గా మొదలైన ఓయో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. భారీగా లాభాలు ఆర్జిస్తూ దూసుకుపోతోంది. త్వరలోనే ఐపీఓకి వెళ్లేందుకు సిద్ధమవుతోన్న ఓయో ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
04:33 PM (IST) May 29
IPL Records: ధనాధన్ ఇన్నింగ్స్ లు.. షాాాకిచ్చే బౌలింగ్ ప్రదర్శనలకు పెట్టింది పేరు ఐపీఎల్. ప్రస్తుతం 18వ సీజన్ జరుగుతోంది. అయితే, ఈ మెగా టోర్నీలో కేవలం 3 జట్లు మాత్రమే 40 వేలకు పైగా పరుగులు చేశాయి. ఆ మూడు జట్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
04:23 PM (IST) May 29
న్యాయం స్థానం అంటేనే నిజం, నిజాయితీ. కోర్టు బోనులో నిల్చున్న వ్యక్తిని కూడా అంతా నిజమే చెబుతానని ప్రమాణం చేయిస్తారు. అయితే ఓ జస్టిస్ మాత్రం దీనికి భిన్నంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
04:02 PM (IST) May 29
ఆది శంకరాచార్యుని జన్మస్థలమైన కేరళలోని కాలడి నుంచి కశ్మీర్‌లోని శారదా పీఠం వరకు ప్రత్యేక బుల్లెట్ ర్యాలీ జరగబోతోంది. ‘బుల్లెట్ ఎగెయినెస్ట్ బుల్లెట్’ అనే నినాదంతో, ఈ ఐతిహాసిక ప్రయాణం జూన్ 1న ప్రారంభమవుతుంది.
03:48 PM (IST) May 29
ఇప్పటివరకు ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ కార్లు చూసాం. మరి ఎలక్ట్రిక్ విమానాలు, రైళ్ళు, నౌకలు చూసారా? అయితే భవిష్యత్ లో ఇది సాధ్యం కావచ్చు. ఈ మేరకు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అద్భుత ఆవిష్కరణ చేసారు. దానిగురించి తెలుసుకుందాం.
03:27 PM (IST) May 29
ప్రస్తుతం సోలార్ ఎనర్జీ వినియోగం భారీగా పెరుగుతోంది. ఒక్క భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సోలార్ వినియోగించే వారి సంఖ్య పెరుగుతోంది. మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో కూడా సోలార్ విప్లవం పెరుగుతోంది.
03:19 PM (IST) May 29
తెలుగుదేశం పార్టీకి భారీ స్థాయిలో విరాళం ప్రకటించాడు ప్రముఖ నిర్మాత నాగవంశీ. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా ప్రకటించారు.
02:30 PM (IST) May 29
గూగుల్ పే, ఫోన్ పే లా త్వరలో మనం ఎక్స్ మనీ పేమెంట్ కూడా చేయబోతున్నాం. ఎక్స్ యాప్ (ట్విట్టర్) త్వరలోనే ఈ డిజిటల్ చెల్లింపుల సేవను ప్రారంభించనుంది.
02:04 PM (IST) May 29
నార్త్ లండన్ 426 పరుగులు చేయగా, రిచ్‌మండ్ కేవలం 2 పరుగుల్లో ఆలౌట్ అవడం క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోరుగా నమోదైంది.
01:41 PM (IST) May 29
షావోమీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV, YU7ని జూలైలో లాంచ్ చేస్తోంది. మోడెనా ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన ఈ SUV కారులో అదిరిపోయే ఫీచర్లను అందించనున్నట్లు తెలుస్తోంది.
01:31 PM (IST) May 29
చంద్రబాబు మే 30న సీఐఐ సమావేశం కోసం ఢిల్లీకి వెళ్తారు. కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం, 31న కోనసీమ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
12:58 PM (IST) May 29
మీకు ఆధార్ కార్డ్ ఎలాగో మీ ఇంటికి డిజిపిన్ అలాగే. కేంద్ర ప్రభుత్వం దీన్ని అందిస్తుంది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు వెంటనే తీసుకోవాలనుకుంటారు. ఈ డిజిపిన్ ప్రయోజనాలేంటి? ఎలా పొందాలి? ఇక్కడ తెలుసుకుందాం.
12:27 PM (IST) May 29
టీడీపీ మహానాడుకు బాలయ్య హాజరు కావట్లేదు. జార్జియాలో అఖండ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నట్టు సమాచారం.