MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Jobs
  • ISRO Jobs : తెలుగు యువతకు బంపరాఫర్.. రూ.50,000 జీతంతో ఇస్రోలో ఉద్యోగాలు

ISRO Jobs : తెలుగు యువతకు బంపరాఫర్.. రూ.50,000 జీతంతో ఇస్రోలో ఉద్యోగాలు

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మీకు అన్ని అర్హతలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకొండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 29 2025, 09:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇస్రోలో ఉద్యోగాల భర్తీ
Image Credit : isro

ఇస్రోలో ఉద్యోగాల భర్తీ

ISRO Jobs : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 320 సైంటిస్ట్/ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది ఇస్రో. మీకు అన్ని అర్హతలుంటే వెంటనే దరఖాస్తు చేసుకొని ప్రతిష్టాతక సంస్థలో ఉద్యోగాన్ని పొందండి. 

ఆసక్తి ఉన్నవారు ఇస్రో అధికారిక వెబ్‌సైట్ isro.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 27 నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది... దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 16, 2025. ఆలోపు మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇస్రోలో ఖాళీల వివరాలు
Image Credit : Getty

ఇస్రోలో ఖాళీల వివరాలు

1. సైంటిస్ట్/ఇంజనీర్ ‘SC’ (ఎలక్ట్రానిక్స్): 113 ఖాళీలు

2. సైంటిస్ట్/ఇంజనీర్ ‘SC’ (మెకానికల్): 160 ఖాళీలు

3. సైంటిస్ట్/ఇంజనీర్ ‘SC’ (కంప్యూటర్ సైన్స్): 44 ఖాళీలు

4. సైంటిస్ట్/ఇంజనీర్ ‘SC’ (ఎలక్ట్రానిక్స్)– PRL: 2 ఖాళీలు

5. సైంటిస్ట్/ఇంజనీర్ ‘SC’ (కంప్యూటర్ సైన్స్) – PRL: 1 ఖాళీ

35
ఇస్రో ఉద్యోగాలకు అర్హతలివే
Image Credit : FREEPIK

ఇస్రో ఉద్యోగాలకు అర్హతలివే

ఇస్రో సైంటిస్ట్/ఇంజనీర్ ఉద్యోగాలకు సంబంధిత డిగ్రీ ఉండాలి. 2024-25 విద్యా సంవత్సరంలో పైన పేర్కొన్న కోర్సులు పూర్తి చేయబోయే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 31.08.2025 లోపు డిగ్రీ పూర్తి చేసి, మొత్తం 65% మార్కులు లేదా 6.84/10 CGPA (అన్ని సెమిస్టర్ల సగటు) ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు.

జూన్ 16, 2025 నాటికి వయసు 28 ఏళ్లులోపు ఉండాలి. అంతకంటే ఎక్కువ వయసు గలవారు అనర్హులు.

45
ఇస్రో ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ
Image Credit : Google

ఇస్రో ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ

ఎంపిక రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. రాత పరీక్షలో రెండు భాగాలు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా, అర్హులైన అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.

సాలరీ :

ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు రూ.56,100 సాలరీ ఉంటుంది. ఇక ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

55
దరఖాస్తు ఫీజు ఎంత?
Image Credit : Getty

దరఖాస్తు ఫీజు ఎంత?

అన్ని పోస్టులకు దరఖాస్తు ఫీజు రూ.250/-. అయితే ప్రారంభంలో అందరు అభ్యర్థులు ఒక దరఖాస్తుకు రూ.750/- ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు మాత్రమే ప్రాసెసింగ్ ఫీజును ఈ క్రింది విధంగా తిరిగి ఇస్తారు:

* దరఖాస్తు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు పొందిన అభ్యర్థులకు (మహిళలు, SC/ST/ PwBD, మాజీ సైనికులు) రూ.750 పూర్తిగా తిరిగి ఇవ్వబడుతుంది.

* రాత పరీక్షకు హాజరైన మహిళలు, SC/ST/ PwBD, మాజీ సైనికులు కాకుండా ఇతర అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు పోను రూ.500 తిరిగి ఇవ్వబడుతుంది.

పరీక్షా కేంద్రాలు :

 తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ ఒక్కటే పరీక్షాకేంద్రం. దేశవ్యాప్తంగా అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, గౌహతి, కోల్ కతా, లక్నో, న్యూడిల్లీ, తిరువనంతపురం కూడా పరీక్షా కేంద్రాలే.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
ఉద్యోగాలు, కెరీర్
విద్య
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Govt Job : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. కేవలం పది పాసైతే చాలు, ఎగ్జామ్ లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్
Recommended image2
Jobs : తెలుగమ్మాయిలకు లక్కీ ఛాన్స్.. కేవలం పది పాసైతే చాలు, సొంత గ్రామంలో గవర్నమెంట్ జాబ్
Recommended image3
Bank Jobs : రాతపరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూతోనే బ్యాంక్ జాబ్.. ఒకటిరెండు కాదు 2049 పోస్టులు
Related Stories
Recommended image1
TTD Jobs : హిందూ యువతకు బంపరాఫర్ .. టిటిడిలో ఉద్యోగాలే ఉద్యోగాలు
Recommended image2
Jobs: 12వ తరగతి పాసైతే చాలు.. భారీ వేతనంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved