PBKS vs RCB Qualifier 1 IPL 2025: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ల అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ 14.1 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మలు చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

PBKS vs RCB Qualifier 1 IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పంజాబ్ బౌలర్ల ఫైర్ కొనసాగింది. అద్భుతమైన బౌలింగ్ తో పంజాబ్ కింగ్ పై ఆర్సీబీ పంజా విసిరింది. 7 ఓవర్లలోనే పంజాబ్ 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత మరో 7 ఓవర్లు ఆడి అన్ని వికెట్లు కోల్పోయింది. 14.1 ఓవర్లలో 101 పరుగుల వద్ద పంజాబ్ ఆలౌట్ అయింది.

పంజాబ్ చెత్త బ్యాటింగ్

వరుసగా వికెట్లు పడుతున్నా పంజాబ్ ప్లేయర్లు ఆటతీరును మార్చుకోలేదు. పిచ్ కు తగ్గట్టుగా ఆడే ప్రయత్నం చేయకుండా బిగ్ షాట్స్ ఆడే క్రమంలో వికెట్లు కోల్పోయారు. ప్రియాంష్ ఆర్య 7 పరుగులు, ప్రభ్ సిమ్రాన్ 18 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా చెత్త షాట్ ఆడి 2 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. జోష్ ఇంగ్లీస్ 4 పరుగులు, నేహల్ వధేరా 8 పరుగులు, మార్కస్ స్టోయినీస్ 26 పరుగులు, శశాంక్ సింగ్ 3 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఈ మ్యాచ్ తో ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడిన ముషీర్ ఖాన్ పరుగుల ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ 18 పరుగులు, హర్పీత్ బ్రార్ 4 పరుగులు చేశారు. 14.1 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 101 పరుగులకు ఆలౌట్ అయింది.

ఆర్సీబీ బౌలర్లు అదరగొట్టారు

ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్లు పంజాబ్ పై పంజా విసిరారు. అద్భుతమైన బౌలింగ్ తో పంజాబ్ కింగ్స్ ను చిత్తు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో యష్ దయాల్ 2, జోష్ హెజిల్ వుడ్ 3 వికెట్లు తీసుకున్నారు. సుయాష్ శర్మ కీలకమైన 3 వికెట్లు తీసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్, రోమారియో షెఫర్డ్ లు చెరో ఒక వికెట్ పడగొట్టారు.

 

Scroll to load tweet…