IPL : ఐపీఎల్‌లో 40,000+ పరుగులు చేసిన టాప్ 3 జట్లు ఇవే!
IPL Records: ధనాధన్ ఇన్నింగ్స్ లు.. షాాాకిచ్చే బౌలింగ్ ప్రదర్శనలకు పెట్టింది పేరు ఐపీఎల్. ప్రస్తుతం 18వ సీజన్ జరుగుతోంది. అయితే, ఈ మెగా టోర్నీలో కేవలం 3 జట్లు మాత్రమే 40 వేలకు పైగా పరుగులు చేశాయి. ఆ మూడు జట్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మెగా క్రికెట్ లీగ్ ఐపీఎల్
2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఇప్పటివరకు టన్నుల కొద్దీ పరుగులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఐపీఎల్ 18వ సీజన్ కొనసాగుతోంది. ఐపీఎల్ 2025లో కూడా పలువురు బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు. కొన్ని జట్లు రికార్డు స్థాయిలో పరుగులు సాధించాయి.
ఐపీఎల్ లో 12 సార్లు 250+ పరుగులు నమోదు
ఐపీఎల్ లో టీమ్స్ 200 పరుగులు చేయడం సాధారణంగా మారిపోయింది. ఇప్పటివరకు 12 సార్లు ఐపీఎల్‌లో 250+ పరుగులు నమోదయ్యాయి. కొన్ని జట్లు మిగతా జట్లతో పోలిస్తే భారీ స్కోర్లు సాధించాయి. 18 సీజన్లు గడిచిన ఐపీఎల్‌లో కొన్ని జట్లు 40,000+ పరుగులను సాధించాయి. ఈ మార్కును కేవలం మూడు జట్లు మాత్రమే అందుకున్నాయి. వాటిలో ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, గత ఛాంపియన్ కేకేఆర్ తో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా లేదు. ఈ లిస్టులో ఏ జట్లు ఉన్నాయంటే..
3 పంజాబ్ కింగ్స్: 40,072 పరుగులు
ఐపీఎల్ లో పంజాబ్ జట్టుకు ప్రతిసీజన్ లో కూడా పరుగులు వర్షం కురిపించే బ్యాటర్లు ఉంటారు. ఐపీఎల్ లో ఇటీవలే పంజాబ్ కింగ్స్ 40,000 పరుగులు మార్కును అందుకుంది. ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది.
2. ఆర్‌సీబీ: 40,814 పరుగులు
ఐపీఎల్ లో టైటిల్ గెలవకపోయినా ఆర్సీబీకి ఉన్న క్రేజ్ ప్రత్యేకమనే చెప్పాలి. ఆ జట్టు తరఫున చాలా మంది ప్లేయర్లు ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడారు. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో జట్టు ఆర్సీబీ. ఐపీఎల్ 2025 టైటిల్ ఫేవరెట్ గా ఉంది.
1. ముంబై ఇండియన్స్: 42,297
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్. ఇప్పటివరకు ఐదు సార్లు టైటిల్ గెలుచుకుంది. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా టాప్ లో కొనసాగుతోంది.