- Home
- Automobile
- Xiaomi yu7: 760 కిలోమీటర్లు మైలేజ్.. షావోమీ ఎలక్ట్రిక్ కారు ఫీచర్స్ తెలిస్తే స్టన్ అవ్వాల్సిందే
Xiaomi yu7: 760 కిలోమీటర్లు మైలేజ్.. షావోమీ ఎలక్ట్రిక్ కారు ఫీచర్స్ తెలిస్తే స్టన్ అవ్వాల్సిందే
షావోమీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV, YU7ని జూలైలో లాంచ్ చేస్తోంది. మోడెనా ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన ఈ SUV కారులో అదిరిపోయే ఫీచర్లను అందించనున్నట్లు తెలుస్తోంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
SUV YU7
ప్రముఖ టెక్ దిగ్గజం Xiaomi తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV YU7ని ఆవిష్కరించింది. లాంచ్ సంబంధిత వివరాలను ఈ ఏడాది జూలైలో ప్రకటించనుంది. అధికారిక ప్రకటన తర్వాత బుక్సింగ్స్ ప్రారంభించనున్నారు.
కంపెనీ మోడెనా ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి ఇటీవల విడుదలైన YU7ని తయారు చేసినట్లు సమాచారం. ఈ కారు 1608 mm ఎత్తు, 4999 mm పొడవు, 996 mm వెడల్పు. దీనికి 3000 mm వీల్‌బేస్ తో తీసుకొస్తున్నారు.
ఈ కారును కొలంబియన్ ఎమరాల్డ్స్, ఆరెంజ్, మెటాలిక్ టైటానియం ఫినిషెస్ ద్వారా ప్రేరణ పొందిన ఆకుపచ్చ రంగుల్లో తీసుకొస్తున్నారు.
అదిరిపోయే ఫీచర్లు
ఇందులో LED హెడ్‌ల్యాంప్ ను ఇవ్వనున్నారు. వెనుక భాగంలో C షేప్ లైట్ బార్‌తో బలమైన డిజైన్ ను ఇవ్వనున్నారు. ఈ మోడల్ 19 నుంచి 20 అంగుళాల పరిమాణంలో అందమైన అల్లాయ్ వీల్స్‌తో తీసుకొస్తున్నారు.
YU7 ఇన్‌వర్డ్-ఫోల్డింగ్ ఎలక్ట్రానిక్ డోర్ హ్యాండిల్స్, అద్భుతమైన యాంబియంట్ లైటింగ్‌తో అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇందులో అల్ట్రా-వైడ్‌బ్యాండ్ ని అందించనున్నారు. ఇది స్మార్ట్‌ఫోన్ ఆధారిత కీలెస్ ఎంట్రీ, బూట్ యాక్సెస్ పొందొచ్చు.
ఇంటీరియర్
ఇంటీరియర్ డిజైన్ విషయానికొస్తే.. ప్రయాణీకులు క్యాబిన్‌లోని 43-అంగుళాల వెడల్పు "హైపర్‌విజన్" డిస్‌ప్లేలో ప్రతిదీ చూడవచ్చు. ఫ్యూచరిస్టిక్ మల్టీపర్పస్ స్టీరింగ్ వీల్, ముందు భాగంలో రెండు కప్ హోల్డర్లు, ఆటోమేటెడ్ క్లైమేట్ కంట్రోల్, 123-డిగ్రీల రిక్లైన్ ఆప్షన్‌తో "జీరో గ్రావిటీ" ఫ్రంట్ సీట్లు వంటి అధునాతన ఫీచర్లను అందించారు.
మైలేజ్
ఇక ఈ కారు రేంజ్ విషయానికొస్తే 101.7 kWh NCM బ్యాటరీతో వచ్చే కారు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 760 కిలోమీటర్లు దూసుకెళ్తుంది. అలాగే 96.3 kWh LFP బ్యాటరీ వెర్షన్ కారు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 770 కిలోమీటర్లు రేంజ్ అందిస్తుంది. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.