PBKS vs RCB Qualifier 1 IPL 2025: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ టీమ్ మొదట బ్యాటింగ్ కు దిగింది.

PBKS vs RCB Qualifier 1 IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైర్ కొనసాగుతోంది. అద్భుతమైన బౌలింగ్ తో పంజాబ్ కు షాక్ ఇచ్చింది. 11 ఓవర్లలోపే పంజాబ్ 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆర్సీబీ సూపర్ బౌలింగ్

ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో పంజాబ్-బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ మొదట బ్యాటింగ్ కు దిగింది.

పంజాబ్ టాపార్డర్ పరుగల వర్షం కురిపిస్తుందని అందరూ భావించారు. కానీ అలాంటిది కనిపించలేదు. బెంగళూరు నిప్పులు చెరిగే బౌలింగ్ తో పంజాబ్ టాపార్డర్ ను పెవిలియన్ కు పంపింది. పెద్దగా పరుగులు చేయకుండా అడ్డుకుంది. ఆర్సీబీ సూపర్ బౌలింగ్ తో పంజాబ్ టీమ్ 9 ఓవర్లలోపే 7 వికెట్లు కోల్పోయింది. మరో ఓవర్ ముగిసిన తర్వాత 8వ వికెట్ గా స్టోయినీస్ అవుట్ అయ్యాడు.

 

Scroll to load tweet…

 

ప్రియాంష్ ఆర్య 7 పరుగులు చేసి యష్ దయాల్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. ప్రభ్ సిమ్రాన్ 18 పరుగుల వద్ద భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. గాయం కారణంగా గత మ్యాచ్ లకు దూరంగా ఉన్న హెజిల్ వుడ్ సూపర్ బౌలింగ్ తో పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తో పాటు జోష్ ఇంగ్లీస్ వికెట్లు తీసుకున్నాడు. నేహల్ వధేరాను యష్ దయాల్ బౌల్డ్ చేశాడు. సుయాస్ శర్మ మంచి ఫామ్ లో ఉన్న శశాంక్ సింగ్ ను 3 పరుగుల వద్ద బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన ముషీర్ ఖాన్ కూడా అవుట్ చేశాడు. దంతో పంజాబ్ టీమ్ 10.3 ఓవర్లలో 78 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆర్సీబీ బౌలర్లలో యష్ దయాల్ 2, జోష్ హెజిల్ వుడ్ 2 వికెట్లు, సుయాష్ శర్మ 3 వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ కుమార్ కు ఒక వికెట్ దక్కింది. 

 

Scroll to load tweet…

 

ఐపీఎల్ 2025 సీజన్ క్వాలిఫయర్ 1 పంజాబ్ జట్టు ప్లేయింగ్ XI

ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, కైల్ జామీసన్.

పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్‌: విజయ్‌కుమార్ వైషాక్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ముషీర్ ఖాన్, జేవియర్ బార్ట్‌లెట్.

ఐపీఎల్ 2025 సీజన్ క్వాలిఫయర్ 1 బెంగళూరు జట్లు ప్లేయింగ్ XI

విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ సబ్: మయాంక్ అగర్వాల్, రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్.