తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

09:10 AM (IST) Jun 12
currency: అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఏమో.. మీ దగ్గర ఉన్న పాత కరెన్సీ రూపంలోనూ రావచ్చు. మీ ఇనుప పెట్టెల్లో, పాత బీరువాల్లో రూ.5 నోట్లు ఏమైనా ఉన్నాయేమో ఓసారి చెక్ చేయండి. ఎందుకంటే అవే ఇప్పుడు మిమ్మల్ని లక్షాధికారిని చేస్తాయి.
11:53 PM (IST) Jun 11
Kagiso Rabada: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025 ఫైనల్ లో కగిసో రబాడ (5/51) అద్భుత బౌలింగ్‌తో ఆస్ట్రేలియాను కేవలం 212 పరుగులకే కట్టడి చేసింది దక్షిణాఫ్రికా.
11:30 PM (IST) Jun 11
ICC Hall of Fame: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇప్పటివరకు 11 మంది భారత క్రికెటర్లకు స్థానం లభించింది. వారి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
11:06 PM (IST) Jun 11
australia vs south africa: స్టీవ్ స్మిత్ లార్డ్స్‌లో 99 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టారు. డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆస్ట్రేలియాకు విలువైన ఇన్నింగ్స్ ను ఆడాడు.
10:45 PM (IST) Jun 11
Taiwan denies China claim thanks India: చైనా చెప్తున్నది అబద్ధమనీ, తమ మీద ఎప్పుడూ చైనా పాలన లేదని తైవాన్ స్పష్టం చేసింది. అలాగే, ఓడలో మంటలు ఆర్పడానికి సహాయం చేసినందుకు భారత్ కి కృతజ్ఞతలు తెలిపింది.
10:36 PM (IST) Jun 11
Gold: సింగపూర్‌లోని 'ది రిజర్వ్' అనే రహస్య గోడౌన్ లో రూ.13,000 కోట్ల విలువైన బంగారం నిల్వ ఉందట. దీని భద్రత కోసం 500 సీసీటీవీ కెమెరాలు, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆ గోల్డ్ అంతా ఎవరిదో తెలుసా?
10:17 PM (IST) Jun 11
Telangana cabinet: తెలంగాణలో కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించారు. అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్, వాకిటి శ్రీహరికి కీలక శాఖలు లభించాయి.
10:07 PM (IST) Jun 11
పుట్టుకతోనే కొన్ని లక్షణాలు వస్తాయని, దీంతో లైఫ్‌లో ఈజీగా సక్సెస్ కూడా వచ్చేస్తుందని చాలా మంది అనుకుంటారు. కాని అది తప్పని మానసిక నిపుణులు చెబుతున్నారు. టాలెంట్ కన్నా ఈ ఒక్క లక్షణం మీకుంటే ఏ విషయంలోనే విజయం సాధించవచ్చని అంటున్నారు. అదేంటో చూద్దామా?
09:59 PM (IST) Jun 11
Journalist Krishnamraju arrested: అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో జర్నలిస్టు కృష్ణంరాజు విశాఖలో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
09:20 PM (IST) Jun 11
శాన్య రాష్ట్రాల్లో టూరిస్ట్ ప్రదేశాలు ఇటీవల వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ క్రమంలో అగర్తలో టాప్ 7 టూరిస్ట్ ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
08:56 PM (IST) Jun 11
Cicket 1xBat: MPL 2025లో ఈగల్ నాసిక్ టైటాన్స్‌కు 1xBat స్పోర్టింగ్ లైన్స్ స్పాన్సర్‌గా చేరింది. ఇది యువ క్రీడాకారులకు పెద్ద వేదికను అందించనుంది.
08:17 PM (IST) Jun 11
Govt Schools to Start Nursery LKG UKG: సెలవుల తర్వాత స్కూల్స్ రీఓపెన్ సమయంలో తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభించనున్నారు.
07:48 PM (IST) Jun 11
తెలంగాణ ప్రజలను వాతవారణ శాఖ అలర్ట్ చేసింది. రానున్న 5 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇంతకీ ఏయే ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
07:26 PM (IST) Jun 11
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ హాల్ టికెట్లను విడదుల చేశారు. పరీక్షకోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
07:13 PM (IST) Jun 11
RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విక్రయిస్తున్నారనే వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆర్సీబీ ని కోనుగోలు చేస్తున్నారనే అంశం వైరల్ గా మారింది. తాజాగా ఆయన ఈ విషయంపై స్పందించారు.
07:11 PM (IST) Jun 11
తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగిసింది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో సీఎం ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పలు కీలక విషయాలను మీడియాతో పంచుకున్నారు..
06:50 PM (IST) Jun 11
యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత లావాదేవీల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అయితే రీఛార్జ్ వంటి వాటిపై కొంతమేర ఛార్జీలు వసూలు చేస్తున్నా లావాదేవీలు మాత్రం ఉచితంగా అందిస్తున్నారు. అయితే త్వరలోఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.
06:29 PM (IST) Jun 11
Gold: చాలామంది బంగారంపై పెట్టుబడి పెట్టడం చాలా సేఫ్ అనుకుంటారు. కానీ లాంగ్ టర్మ్ లో లాభాలు రావాలంటే ఇంకా బెటర్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
06:08 PM (IST) Jun 11
French Open titles: ఓపెన్ యుగంలో ఫ్రెంచ్ ఓపెన్‌లో అత్యధిక టైటిల్స్ గెలిచిన దేశాల జాబితాలో స్పెయిన్ 21 విజయాలతో మొదటిస్థానం దక్కించుకుంది. మొత్తంగా ఫ్రంచ్ ఓపెన్ టైటెల్స్ అత్యధికం గెలుచుకున్నటాప్ 5 దేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
05:55 PM (IST) Jun 11
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన 'సూపర్ సిక్స్' హామీల అమల్లో మరో ముందడుగు వేసింది. సీఎం చంద్రబాబు “తల్లికి వందనం” పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పథకం ద్వారా పేద విద్యార్థులకు చదువు కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అందించనున్నారు.
05:23 PM (IST) Jun 11
ట్రంప్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన ఎలాన్ మస్క్ ఇప్పుడు తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. విభేదాల అనంతరం మారిన మస్క్ ధోరణి చర్చనీయాంశం అవుతుంది.
04:25 PM (IST) Jun 11
ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్లిన భార్య సోనం అతడిని కిరాయి హంతకులతో చంపించినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది.
03:35 PM (IST) Jun 11
ఎర్రవల్లి ఫాంహౌస్ లో కాలుజారిపడ్డ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డిని మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఆయనను కలిసేందుకు వెళ్లే పల్లా ప్రమాదవశాత్తు గాయపడ్డారు.
02:06 PM (IST) Jun 11
ప్రస్తుతం డబ్బులు పొదుపు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొందరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే మరికొందరు రిస్క్‌లేని ప్రభుత్వ పథకాలు సేవింగ్స్ చేస్తున్నారు. అలాంటి ఒక బెస్ట్ ప్రభుత్వ పొదుపు పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
01:40 PM (IST) Jun 11
కారుల్లో AMT వేరియంట్లను ఇష్టపడే వారు ఎక్కువగా ఉంటారు. ఇవి నడపడానికి చాలా సింపుల్ గా ఉంటాయి. మీరు కూడా ఇలాంటి కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ సమాచారం మీకు బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మార్కెట్ లో టాప్ 5 AMT కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
01:14 PM (IST) Jun 11
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ఆసక్తికరంగా సాగింది. కాళేశ్వరం కమీషన్ కేసీఆర్ విచారణ సమయంలో అందరినీ బయటకు పంపించింది. కేసీఆర్ కోరికమేరకే ఇలా చేసారు జస్టిస్ పిసి ఘోష్.
01:03 PM (IST) Jun 11
LIC.. ఇన్సూరెన్స్ పథకాల ద్వారా కుటుంబాలకు భరోసా ఇవ్వడమే కాకుండా మహిళలకు ఉపాధి కూడా కల్పిస్తోంది. మహిళలు స్వయం ఉపాధి పొందాలన్న ఉద్దేశంతో రూ.2 లక్షలు సంపాదించే మార్గాన్ని అమలు చేస్తోంది. ఆ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
12:56 PM (IST) Jun 11
మజ్జిగ తాగడానికే కాదు, మొక్కలకీ మంచిది! మట్టికి పోషకాలు అందిస్తుంది, చీడపీడలను తరిమికొడుతుంది, మొక్కల వేర్లను బలపరుస్తుంది. మీ గార్డెన్‌కి మజ్జిగ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి.
12:12 PM (IST) Jun 11
దేశంలోని ముఖ్య నగరాల్లో ట్రాఫిక్ జామ్ తగ్గించడానికి ఫ్లయింగ్ బస్సులు, అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు సిటీల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతోంది. ఫ్లయింగ్ బస్సులు కూడా నడపాలని ప్రణాళికలు వేస్తోంది.
12:12 PM (IST) Jun 11
2026 ప్రపంచ కప్‌పై ఇంగ్లాండ్ ఆశలు సెనెగల్ చేతిలో 3-1 తేడాతో ఓటమి తర్వాత మసకబారాయి. థామస్ టుచెల్ నాయకత్వంలో లోతైన వ్యూహాత్మక, నిర్మాణాత్మక లోపాలు బయటపడ్డాయి.
12:09 PM (IST) Jun 11
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమీషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సమయంలో ఆయనవెంట కూతురు కవిత, కొడుకు కేటీఆర్ కార్యాలయంలోకి వెళ్లలేదు… ఎవరు వెళ్లారో తెలుసా?
11:48 AM (IST) Jun 11
కాళేశ్వరం ప్రాజెక్ట్.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం. ఓ అద్భుత మానవ నిర్మాణం. కానీ ఇప్పుడు దీని చుట్టూ వివాదాలు చుట్టుముట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు, వివాదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
11:33 AM (IST) Jun 11
లాస్ ఏంజెలెస్‌లో వలసదారుల అరెస్టులపై ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. యాపిల్ స్టోర్‌తో పాటు పలు దుకాణాలు దోచేసిన దుండగులు.
11:12 AM (IST) Jun 11
ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్టు సరెండర్ చేయాలని ఆదేశించింది.
10:57 AM (IST) Jun 11
ప్రియుడి కోసం భర్తను హనీమూన్ కి తీసుకుని వెళ్లి మరి హత్య చేసింది సోనమ్. కానీ ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఏడేడు జన్మలకు నీవే తోడుగా అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి కవర్ చేసింది. కానీ నిజం బయటపడి కటకటాలు లెక్కపెడుతోంది.
10:53 AM (IST) Jun 11
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఏర్పాటుచేసిన జస్టిస్ పిసి ఘోష్ కమీషన్ ముందు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఉదయమే తండ్రిని కలిసారు కవిత. ఈక్రమంలో ఇద్దరూ ఏ మాట్లాడుకున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
10:33 AM (IST) Jun 11
బిహార్‌లో యువతికి అదనపు కట్నంగా కిడ్నీ ఇవ్వాలంటూ అత్తింటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి.బాధితురాలి ఫిర్యాదు తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
10:25 AM (IST) Jun 11
బంగారాన్ని భారతీయులను విడదీసి చూడలేం. వీలు దొరికినప్పుడల్లా బంగారాన్ని కొనుగోలు చేయాలని చూస్తుంటారు. అందుకే బంగారం ధరల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కాగా తాజాగా బుధవారం బంగారం ధరలో భారీగా పెరుగుదల కనిపించింది.
09:41 AM (IST) Jun 11
భారత్ తాజా డిజిపిన్ ద్వారా ప్రతి ఇంటికీ ఖచ్చితమైన డిజిటల్ చిరునామా లభించనుంది. ఇది తపాలాశాఖ, ఐఐటీ, ఇస్రో కలిసి అభివృద్ధి చేశారు.
08:54 AM (IST) Jun 11
కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి ద్వారా ప్రత్యక్ష రాజకీయాలు చేపట్టారు. బిఆర్ఎస్ తరపున కాకుండా సొంతంగా ప్రజల కోసం పోరాటానికి దిగారు. ఈక్రమంలో మంగళవారం ఆమె అరెస్టయ్యారు.