currency: అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఏమో.. మీ దగ్గర ఉన్న పాత కరెన్సీ రూపంలోనూ రావచ్చు. మీ ఇనుప పెట్టెల్లో, పాత బీరువాల్లో రూ.5 నోట్లు ఏమైనా ఉన్నాయేమో ఓసారి చెక్ చేయండి. ఎందుకంటే అవే ఇప్పుడు మిమ్మల్ని లక్షాధికారిని చేస్తాయి. 

ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. మళ్లీ అందరూ పాత కాలం నాటి వస్తువులను ఇష్టపడుతున్నారు. పాత ఇళ్లు, కార్లు, డ్రెస్సులు ఇలా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న సామెతలో నిజాన్ని ఆస్వాధిస్తున్నారు. పూర్వ కాలం నాటి వస్తువులు ఎక్కడున్నా కొనుక్కోవడానికి కొందరు ఔత్సాహికులు ముందుకొస్తున్నారు. ఆన్ లైన్ లో అలాంటి వస్తువుల కోసం సెర్చ్ చేస్తుంటారు. పాత కాలం వస్తువులు కొనే కంపెనీలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. 

ట్రాక్టర్ బొమ్మ ఉన్న రూ.5 నోటు మీ దగ్గర ఉందా?

ముఖ్యంగా కొందరు వ్యక్తులు, కంపెనీలు పాత కాలం నాటి కరెన్సీ, నాణేలను సేకరించడం హాబీగా పెట్టుకుంటారు. అలాంటి నోట్లు కొనడానికి రూ.లక్షల్లో ఖర్చుపెడుతుంటారు. మీ దగ్గర గాని పాత కరెన్సీ ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులే. ప్రస్తుతం పాత కాలం నాటి రూ.5 నోటు కోసం ఆన్ లైన్ లో సర్చింగ్ జరుగుతోంది. ట్రాక్టర్ బొమ్మతో ఉన్న రూ.5 నోటుకు ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. ఒక్క నోటు రూ.6 లక్షల వరకు అమ్ముడుపోతుందట. పాత నోట్లు, నాణేలను అమ్మడానికి చాలా ఆన్‌లైన్ సైట్లు కూడా ఉన్నాయి. కానీ ఆ సైట్లు నమ్మకమైనవా కాదా అని చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. 

ఈ రూ.5 నోటు ప్రత్యేకత ఏమిటి?

ఈ రూ.5 నోటు మీద ట్రాక్టర్ బొమ్మ ఉండాలి. దానిపై రైతు కూర్చుని పొలం దున్నుతున్నట్లు బొమ్మ ఉండాలి. ముఖ్యంగా నోటు ముందు "786" అనే సీరియల్ నంబర్ ఉండాలి. "786" అనేది ముస్లింలకు పవిత్రమైన సంఖ్య. అందుకే ఈ నంబర్ ఉన్న నోట్లకు మంచి ధర పలుకుతుంది. ఈ నంబర్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. మీ దగ్గర ఇలాంటి నోటు ఉంటే రూ.6 లక్షల వరకు అమ్ముకోవచ్చు.

ఎంత దొరుకుతుంది?

ఒక రూ.5 నోటుకు రూ.6 లక్షల వరకు వస్తుంది. మీ దగ్గర ఎన్ని నోట్లు ఉంటే అన్ని రూ.లక్షలు సంపాదించవచ్చన్న మాట. పాత నోట్లను ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నవాళ్ళు వాటిని అమ్మి లక్షాధికారులు అవ్వచ్చు.

ఆన్‌లైన్‌లో ఎక్కడ అమ్మాలి?

ఈ రూ.5 నోటును Quikr (www.quikr.com)లో సులభంగా అమ్ముకోవచ్చు. అక్కడ సెల్లర్‌గా రిజిస్టర్ చేసుకోండి. మీ రూ.5 నోటు ఫోటోను అప్‌లోడ్ చేయండి. మీ యాడ్ చూసి కొనుగోలుదారులు మిమ్మల్ని సంప్రదిస్తారు. మార్కెట్ లో ఉన్న డిమాండ్ ను బట్టి మీరు చెప్పిన ధరకు వారు కొనే అవకాశం కూడా ఉంది. కానీ రిజర్వ్ బ్యాంక్ ఇలాంటి అమ్మకాలకు మద్దతు ఇవ్వదు. ఏదైనా మోసం జరిగితే అది అమ్మేవారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా వ్యక్తిగతం, నమ్మకంపై ఆధారపడిన వ్యాపారం మాత్రమే. ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకోదని గుర్తు పెట్టుకోండి.

అత్యాశకు పోయి ఆన్ లైన్ మోసాలకు గురికావద్దు..

ఇలాంటి నోట్లను కొనే కంపెనీల్లో చాలా వరకు ఫేక్ ఉంటున్నాయి. ఇంటర్నెట్‌లో వచ్చే వార్తలు చూసి నమ్మి డబ్బులిచ్చి మోసపోవద్దు. ఇలాంటవన్నీ వీలైతే నేరుగా లావాదేవీలు నిర్వహించుకోవడం మంచిది. ఈ-మెయిల్, ఓటీపీ, పే ఫస్ట్ లాంటి మోసాల బారిన పడకండి. నమ్మకమైన సైట్లలోనే అమ్మండి. మీ రూ.5 నోటుకు పైన చెప్పిన లక్షణాలు ఉంటే మంచి ధర వస్తుంది. కానీ అమ్మే ముందు నమ్మకమైన సైట్లు, కొనుగోలుదారులు, నిబంధనల గురించి తెలుసుకోండి.