Gold Price: మళ్లీ మొదలైన బంగారం భగభగలు.. ఒక్క రోజులో ఎంత పెరిగిందో తెలుసా?
బంగారాన్ని భారతీయులను విడదీసి చూడలేం. వీలు దొరికినప్పుడల్లా బంగారాన్ని కొనుగోలు చేయాలని చూస్తుంటారు. అందుకే బంగారం ధరల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కాగా తాజాగా బుధవారం బంగారం ధరలో భారీగా పెరుగుదల కనిపించింది.

భారీగా పెరిగిన బంగారం ధర
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో తులం బంగారం ధర ఏకంగా రూ. లక్ష దాటేసింది. దీంతో సామాన్యులు బంగారం అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.
అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కాస్త శాంతించాయి. క్రమంగా ధర తగ్గుతూ వచ్చింది. చాలా రోజుల తర్వాత 24 క్యారెట్ల బంగారం ధర రూ.97 వేల మార్కుకు దిగింది. అయితే బుధవారం బంగారం ధర మళ్లీ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లింది.
ఎంత పెరిగిందంటే.?
గడిచిన కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర బుధవారం భారీగా పెరిగింది. బుధవారం ఒక్క రోజే ఏకంగా రూ. 820 పెరిగి బంగారం ప్రియులకు షాక్ ఇచ్చింది. దీంతో తులం బంగారం ధర మళ్లీ రూ. 98,550కి చేరింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. 24 క్యారెట్లపై 820 పెరగ్గా, 22 క్యారెట్ల బంగారంపై రూ. 750 పెరిగింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.?
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,550గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,350 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 98,400కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90,200గా ఉంది.
* చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,400గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,200 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,400కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,200 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఎలా ఉందంటే.?
* హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 98,400కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,200 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,400గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,200 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నం విషయానికొస్తే ఇక్కడ కూడా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,400కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,200గా నమోదైంది.
ధర పెరగడానికి కారణం ఏంటి.?
అమెరికా, చైనాల మధ్య వాణిజ్య చర్చల నేపథ్యంలోనే బంగారం ధరలు పెరిగినట్లు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్న కారణంతోనే బంగారం ధరలు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.