French Open titles: అత్యధిక ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెలిచిన టాప్ 5 దేశాలు ఇవే
French Open titles: ఓపెన్ యుగంలో ఫ్రెంచ్ ఓపెన్‌లో అత్యధిక టైటిల్స్ గెలిచిన దేశాల జాబితాలో స్పెయిన్ 21 విజయాలతో మొదటిస్థానం దక్కించుకుంది. మొత్తంగా ఫ్రంచ్ ఓపెన్ టైటెల్స్ అత్యధికం గెలుచుకున్నటాప్ 5 దేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రెంచ్ ఓపెన్ లో సత్తా చాటిన దేశాలు
French Open winners : ఓపెన్ యుగంలో ఫ్రెంచ్ ఓపెన్‌లో అత్యధిక టైటిల్స్ గెలుచుకున్న టాప్ 5 దేశాలను పరిశీలించినప్పుడు స్పెయిన్ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ క్లే కోర్ట్ టోర్నమెంట్ వేసవిలో పారిస్‌లో నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ గ్రాండ్ స్లామ్ ఈవెంట్ ను ప్రత్యక్షంగా చూసేందుకు తరలివస్తుంటారు.
ఫ్రాన్స్ ఇప్పటివరకు అత్యధికంగా 38 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు గెలుచుకుంది. రెనే లకోస్ట్, హెన్రీ కోచెట్, జీన్ బొత్రా వంటి లెజెండ్స్ అమేచ్యూర్ యుగంలో రాణించారు. ఓపెన్ యుగంలో యానిక్ నోవా (1983లో) గెలిచిన ఏకైక ఫ్రెంచ్ ఛాంపియన్. ఇటీవల రికార్డులు గమనిస్తే..
1. స్పెయిన్: 21 టైటిల్స్
స్పెయిన్ టెన్నిస్ ఆటగాళ్లు ఫ్రెంచ్ ఓపెన్ లో మొత్తం 21 టైటిల్స్ గెలిచారు. ఆండ్రెస్ గిమెనో 1972లో ఫ్రాన్స్‌కు చెందిన ప్యాట్రిక్ ప్రొయిసీపై గెలిచి మొదటి టైటిల్ గెలిచారు. అనంతరం సెర్జీ బ్రూగెరా 1993, 1994లో వరుసగా రెండు టైటిల్స్ గెలిచాడు. కార్లోస్ మొయా (1998), ఆల్బర్ట్ కోస్టా (2001), జువాన్ కార్లోస్ ఫెర్రెరో (2002) ఒక్కొక్క టైటిల్ అందించారు. కానీ ఈ టోర్నీలో అసలైన మార్పును తీసుకువచ్చిన వ్యక్తి రాఫెల్ నాదల్. 2005 నుంచి 2022 వరకు మొత్తం 14 టైటిల్స్ గెలిచి "క్లే కింగ్"గా ఖ్యాతి పొందాడు. ఇటీవల కార్లోస్ ఆల్కారజ్ ఈ వారసత్వాన్ని కొనసాగించాడు.
2. స్వీడన్: 9 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్
బియార్న్ బోర్గ్ 1974లో మొదటి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచి 1981 వరకూ మొత్తం 6 టైటిల్స్ సాధించాడు. అనంతరం మాట్స్ విలాండర్ 1982, 1985, 1988లో మూడుసార్లు విజయం సాధించి స్వీడిష్ వారసత్వాన్ని కొనసాగించాడు.
3. అమెరికా: 4 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్
మైఖేల్ చాంగ్ 1989లో స్టెఫాన్ ఎడ్బర్గ్‌ను ఓడించి మొదటి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ అందుకున్నాడు. జిమ్ కూరియర్ 1991, 1992లో వరుసగా టైటిల్స్ సాధించాడు. ఆండ్రే అగస్సీ 1999లో ఆఖరిసారిగా టైటిల్ గెలిచాడు.
4. బ్రెజిల్: 3 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్
గుస్తావో కుర్టెన్ 1997, 2000, 2001లో టైటిల్స్ సాధించి బ్రెజిల్‌కు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ విజయాలను అందించాడు.
5. సెర్బియా: 3 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్
నొవాక్ జోకోవిచ్ 2016లో మొదటిసారిగా టైటిల్ గెలిచాడు. ఆ తర్వాత 2021లో నాదల్ ను సెమీ ఫైనల్లో ఓడించి, తుదిపోటీలో స్టెఫానోస్ త్సిత్సిపాస్‌పై తిరుగులేని విజయం సాధించాడు. 2023లో కూడా అతను టైటిల్ గెలిచే అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు.
ఈ గణాంకాలు టెన్నిస్ చరిత్రలో దేశాల ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ, ఫ్రెంచ్ ఓపెన్‌లో వారి విజయాలను గుర్తు చేస్తున్నాయి