MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Kaleshwaram Project Issue: అస‌లేంటీ కాళేశ్వ‌రం వివాదం? కేసీఆర్ దోషిగా తేలితే ఏమ‌వుతుంది.?

Kaleshwaram Project Issue: అస‌లేంటీ కాళేశ్వ‌రం వివాదం? కేసీఆర్ దోషిగా తేలితే ఏమ‌వుతుంది.?

కాళేశ్వరం ప్రాజెక్ట్.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోత‌ల పథ‌కం. ఓ అద్భుత మాన‌వ నిర్మాణం. కానీ ఇప్పుడు దీని చుట్టూ వివాదాలు చుట్టుముట్టుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ ప్రాజెక్టు, వివాదాల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 11 2025, 11:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
కాళేశ్వ‌రం ఎక్క‌డ నిర్మించారు.? దాని ఉద్దేశం ఏంటి.?
Image Credit : Asianet News

కాళేశ్వ‌రం ఎక్క‌డ నిర్మించారు.? దాని ఉద్దేశం ఏంటి.?

“తెలంగాణ మీదుగా వెళ్లే గోదావ‌రి నీరు ఈ ప్రాంతానికి అంద‌డం లేదు.. తెలంగాణ వ‌స్తేనే గోదావ‌రి నీళ్లు మ‌న‌కు ద‌క్కుతాయి”. ఇదీ..తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ ప‌దే ప‌దే చెప్పిన మాట‌. ఇందుకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో మొద‌టి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన కేసీఆర్ ఈ దిశ‌గా అడుగులు వేశారు.

ఇందులో భాగంగానే జ‌య శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా మ‌హ‌దేవ్ పూర్ మండ‌లం క‌న్నెప‌ల్లి స‌మీపంలో గోదావ‌రి న‌దిపై కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేప‌ట్టారు. తెలంగాణ‌లో 13 జిల్లాల్లో 45 ల‌క్ష‌ల ఎక‌రాల ఆయ‌క‌ట్టుకు సాగు నీరు అందించాల‌న్న‌దే ఈ ప్రాజెక్ట్ ల‌క్ష్యం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
ప్ర‌పంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టుగా గుర్తింపు.
Image Credit : our own

ప్ర‌పంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టుగా గుర్తింపు.

గోదావ‌రి నీటిని ఎత్తిపోస్తూ తెలంగాణ‌లో జిల్లాల‌కు సాగు, తాగు నీరు అందించాల‌నే ల‌క్ష్యంతో చేప‌ట్టిన ఈ ప్రాజెక్ట్‌.. ప్ర‌పంచంలోనే మ‌ల్టీ సెజ్ లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టుగా పేరుగాంచింది. 2016లో ఈ ప్రాజెక్టుకు అప్ప‌టి సీఎం కేసీఆర్ శంకుస్థాప‌న చేశారు. 2019 జూన్ 21న ఈ ప్రాజెక్టును కేసీఆర్ జాతికి అంకితం చేశారు. మూడేళ్ల‌లోనే ఈ ప్రాజెక్టు పూర్తి కావ‌డం విశేషం.

38
ప్రాజెక్టులో ముఖ్యంశాలు:
Image Credit : our own

ప్రాజెక్టులో ముఖ్యంశాలు:

* కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు 80 వేల ఎక‌రాల భూమిని సేక‌రించారు.

* 1832 కిలోమీట‌ర్ల మేర గోదావ‌రి నీటి స‌ర‌ఫ‌రా జ‌రిగేలా ప్ర‌ణాళిక‌లు ర‌చించారు.

* ఇందులో భాగంగా 1531 కిలోమీట‌ర్ల మేర గ్రావిటీ కెనాల్‌ ద్వారా, 203 కిలోమీట‌ర్ల సొరంగ మార్గంలో నీటిరి త‌ర‌లించేలా నిర్మాణం చేప‌ట్టారు.

* ప్రాజెక్టులో భాగంగా 20 లిఫ్ట్‌లు, 19 పంపు హౌజ్‌లు, 19 రిజ‌ర్వాయ‌ర్లను రూపొందించారు.

48
మ‌రోవైపు వివాదాలు
Image Credit : our own

మ‌రోవైపు వివాదాలు

ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కాళేశ్వ‌రం ప్రాజెక్టు చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. 2023 అక్టోబ‌ర్‌లో ప్రాజెక్టులో భాగ‌మైన మేడిగడ్డ బ్యారేజీలో పిల్ల‌ర్లు కుంగిపోవ‌డంతో వివాదం మొద‌లైంది. దీనిపై స్పందించిన నేష‌న‌ల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగ‌డ్డ‌, అన్నారం, సుందిల్ల బ్యారేజీల భ‌ద్ర‌త‌పై విచార‌ణ ప్రారంభించింది.

58
అవినీతి జ‌రిగిందంటూ ఆరోప‌ణ‌లు
Image Credit : our own

అవినీతి జ‌రిగిందంటూ ఆరోప‌ణ‌లు

కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అప్ప‌టి బీఆర్ఎస్ అవినీతి చేసింద‌ని ఆరోపించిన కాంగ్రెస్ విచార‌ణ మొద‌లు పెట్టింది. కాళేశ్వ‌రం క‌మిష‌న్ విచార‌ణ పేరుతో క‌మిటీని ఏర్పాటు చేశారు. పీసీ ఘోష్ నేతృత్వంలోని ఈ క‌మిటీ ఇప్ప‌టికే ప‌లువురు అధికారుల‌ను విచారించ‌గా. తాజాగా ప్రాజెక్ట్ నిర్మాణ స‌మ‌యంలో కీల‌క బాధ్య‌త‌ల్లో ఉన్న హ‌రీష్ రావు, ఈట‌ల రాజేంద‌ర్‌ను విచారించగా తాజాగా కేసీఆర్‌ను విచారించింది.

68
ప్రాజెక్టుపై వ‌చ్చిన ప్ర‌ధాన ఆరోప‌ణ‌లు ఇవే.
Image Credit : our own

ప్రాజెక్టుపై వ‌చ్చిన ప్ర‌ధాన ఆరోప‌ణ‌లు ఇవే.

మేడిగడ్డ బ్యారేజ్ లో నిర్మాణ లోపాలు ఉన్నాయి. గోదావరి ప్రవాహాన్ని ఎదుర్కొనలేని స్థాయిలో నిర్మాణం ఉండటం.

మునుపటి ప్రణాళికను మార్చడం వల్ల వ్యయం పెరిగిందని ఆరోపణ. అవ‌స‌రం లేని మార్పుల‌తో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారన్న విమర్శలు వ‌చ్చాయి. భారీగా ఖర్చు పెట్టినా, రైతులకు పూర్తిగా నీరు అందడం లేదు. అనేవి ప్ర‌ధానంగా ఆరోపిస్తున్నారు.

78
కేసీఆర్ దోషిగా తేలితే ఏమవుతుంది?
Image Credit : Social Media

కేసీఆర్ దోషిగా తేలితే ఏమవుతుంది?

ప్రభుత్వాధికారి హోదాలో అక్రమ నిర్ణయాలు తీసుకుంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు నమోదవవచ్చు.

అవినీతి నిరూపితమైతే ఐపీసీ 409 (భారత శిక్షాసమితి – పబ్లిక్ ట్రస్ట్ ఉల్లంఘన) కింద శిక్ష పడే అవకాశం ఉంది. కేసు తీవ్ర‌త ఆధారంగా 7 నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప్రాజెక్టులో అవినీతి జ‌రిగింద‌న్న దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ల‌భించ‌లేవు.

88
బీఆర్ఎస్ ఎదురు దాడి
Image Credit : Google

బీఆర్ఎస్ ఎదురు దాడి

కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై విచార‌ణ‌ను ప్ర‌తీకార చ‌ర్య‌గా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ త‌న అస‌మ‌ర్థ పాలన నుంచి దృష్టి మ‌ళ్లించేందుకే ఈ ప‌ని చేస్తోంద‌ని అంటున్నారు. వేలాది ఎక‌రాల‌కు నీరు అందించేందుకు కృషి చేసిన కేసీఆర్ గౌర‌వాన్ని దెబ్బ తీసేందుకే ఇలాంటి చ‌ర్య‌లు చేప‌డుతున్నార‌ని అంటున్నారు. మ‌రి ఈ వ్య‌వ‌హారం ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ
భారత రాష్ట్ర సమితి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Recommended image2
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Recommended image3
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Related Stories
Recommended image1
Oyo: క‌పుల్స్‌కి పండ‌గే.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఓయో
Recommended image2
Gold Price: మ‌ళ్లీ మొద‌లైన బంగారం భ‌గ‌భ‌గ‌లు.. ఒక్క రోజులో ఎంత పెరిగిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved