- Home
- Business
- Saving scheme: రోజూ రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 35 లక్షలు సొంతం చేసుకోవచ్చు. ఎలాగంటే..
Saving scheme: రోజూ రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 35 లక్షలు సొంతం చేసుకోవచ్చు. ఎలాగంటే..
ప్రస్తుతం డబ్బులు పొదుపు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొందరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే మరికొందరు రిస్క్‌లేని ప్రభుత్వ పథకాలు సేవింగ్స్ చేస్తున్నారు. అలాంటి ఒక బెస్ట్ ప్రభుత్వ పొదుపు పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రామ సురక్ష యోజన
తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడుతూ ఎక్కువ మొత్తాన్ని పొందాలనుకునే వారికి గ్రామ సురక్ష యోజన బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ పథకాన్ని ఇండియన్ పోస్ట్ అందిస్తోంది. ఇది ఒక జీవిత బీమా పథకం. ఇది గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తక్కువ ప్రీమియంతో భద్రతను అందిస్తుంది. ఈ పథకంలో ప్రతిరోజూ కేవలం రూ.50 పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో రూ.35 లక్షల వరకు లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది.
ఎవరు అర్హులు.?
19 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన భారతీయ పౌరులు ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. కనిష్ట బీమా మొత్తం రూ. 10,000, గరిష్ఠ బీమా మొత్తం రూ. 10 లక్షలు ఉంటుంది. నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక లేదా వార్షికంగా ప్రీమియం చెల్లించవచ్చు. ఉదాహరణకు మీరు 19 ఏళ్ల వయస్సులో ఈ పాలసీ తీసుకుంటే, 55 ఏళ్ల వరకు నెలకు రూ. 1,515 చెల్లించాల్సి ఉంటుంది.
రాబడి ఎలా ఉంటుంది.?
ఈ పాలసీ 80 ఏళ్ల వయస్సులో మెచ్యూర్ అవుతుంది. అప్పుడు మీరు రూ.35 లక్షల వరకు పొందవచ్చు. విభిన్న వయస్సుల్లో మెచ్యూరిటీ విలువలు ఇలా ఉంటాయి: పాలసీదారు ముందే మరణిస్తే, నామినీకి మొత్తం ప్రయోజనం బోనస్‌తో కలిపి అందుతుంది.
బోనస్, రుణ సదుపాయాలు కూడా
5 సంవత్సరాల తర్వాత పాలసీపై వార్షిక బోనస్ వర్తిస్తుంది. 4 సంవత్సరాల తర్వాత పాలసీ విలువపై రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. పాలసీ తీసుకున్న 3 సంవత్సరాల తర్వాత సరెండర్ చేసుకునే అవకాశం ఉంది.
లాభాలు ఏంటి.?
పెట్టుబడి అత్యంత సురక్షితం, పోస్ట్ ఆఫీస్ నిఘా ఆధీనంలో ఉంటుంది. అందులోనూ కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో మీ డబ్బులకు ఢోకా ఉండదు. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. సెక్షన్ 80సీ కింద ఆదాయపు మిన్నహాయింపు లభిస్తుంది.