ఈశాన్య భారతదేశంలో తప్పక చూడాల్సిన 7 టూరిస్ట్ ప్రదేశాలు
శాన్య రాష్ట్రాల్లో టూరిస్ట్ ప్రదేశాలు ఇటీవల వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ క్రమంలో అగర్తలో టాప్ 7 టూరిస్ట్ ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

అగర్తలలో చూడాల్సిన 7 అద్భుత ప్రదేశాలు
త్రిపుర రాజధాని అగర్తల ఈశాన్య భారతదేశంలోని అద్భుత నగరం. సాంస్కృతిక వారసత్వం, అద్భుత ప్రకృతి, చారిత్రక ప్రదేశాలతో ప్రత్యేకమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. ఈ ప్రాంతంలోని అందమైన టూరిస్ట్ ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
1. ఉజ్జయంత ప్యాలెస్
త్రిపుర రాజ కుటుంబ నివాసంగా ఉన్న ఈ ప్యాలెస్ ఇప్పుడు రాష్ట్ర చరిత్ర, సంస్కృతిని ప్రదర్శించే మ్యూజియంగా ఉంది. మొఘల్ శైలి తోటలు, దర్బార్ హాల్, అద్భుతమైన నిర్మాణం దీని సొంతం.
2. నీర్మహల్ ప్యాలెస్
త్రిపుర 'సరస్సు ప్యాలెస్' గా ప్రసిద్ధి. హిందూ, మొఘల్ శిల్పకళా శైలి, బోట్ రైడ్స్, లైట్ అండ్ సౌండ్ షో తో ఇది పర్యాటకులను ఆకట్టుకుంటుంది.
3. ఉనాకోటి రాతి శిల్పాలు
1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన హిందూ దేవతల రాతి శిల్పాలు. ప్రసిద్ధ శివుని శిల్పం, జలపాతాలు, ఆధ్యాత్మిక వాతావరణం.
4. సెపహిజాల వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం
చిరుత పులులు, అరుదైన కోతులు, పక్షులకు ఇది నిలయం. బోటింగ్, ట్రెక్కింగ్, బొటానికల్ గార్డెన్ కలిగివుంది.
5. జగన్నాథ్ బారి దేవాలయం
శ్రీ జగన్నాథుడికి అంకితం చేయబడిన పురాతన దేవాలయం. సంప్రదాయ ఆచారాలు, ప్రశాంత వాతావరణం, ఉత్సవాలకు ప్రసిద్ది.
6. జంపూయి కొండలు
త్రిపురలో ఎత్తైన కొండలు. అద్భుతమైన దృశ్యాలు, పచ్చదనం, ప్రశాంత వాతావరణం. ఆరెంజ్ తోటలు, సూర్యోదయంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
7. హెరిటేజ్ పార్క్
త్రిపుర సాంస్కృతిక వారసత్వం, ప్రకృతి సౌందర్యం ప్రదర్శించే పార్క్. త్రిపుర ప్రసిద్ధ ప్రదేశాల నమూనాలు, ట్రెకింగ్ మార్గాలు కలిగివుంది.