Taiwan denies China claim thanks India: చైనా చెప్తున్నది అబద్ధమనీ, తమ మీద ఎప్పుడూ చైనా పాలన లేదని తైవాన్ స్పష్టం చేసింది. అలాగే, ఓడలో మంటలు ఆర్పడానికి సహాయం చేసినందుకు భారత్ కి కృతజ్ఞతలు తెలిపింది.

Taiwan China dispute: తైవాన్ చైనాకి కుండబద్దలు కొట్టినట్టు సమాధానం చెప్పింది. భారత్ లో ఉన్న తైవాన్ ఎంబసీ X లో పోస్ట్ చేస్తూ, తైవాన్ ఎప్పుడూ చైనా పాలనలో లేదని స్పష్టం చేసింది. "చైనా చెప్తున్నది అబద్ధం, అర్థం లేనిది. తైవాన్, చైనా ఒకదానికొకటి లోబడి లేవు. చైనా ఎప్పుడూ తైవాన్ ని పాలించలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తైవాన్ ప్రభుత్వానికే ప్రజల తరఫున మాట్లాడే హక్కు ఉంది" అని తైవాన్ ఎంబసీ పేర్కొంది. 

అలాగే, వాన్ హాయ్ 503 అనే కార్గో షిప్ లో మంటలు ఆర్పడానికి భారత నౌకాదళం, తీర రక్షక దళం చేసిన సహాయానికి తైవాన్ కృతజ్ఞతలు తెలిపింది. "వాన్ హాయ్ 503 ప్రమాదంలో భారత నౌకాదళం, తీర రక్షక దళం చేసిన సత్వర సహాయానికి తైవాన్ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతుంది. కనిపించకుండా పోయిన సిబ్బంది సురక్షితంగా తిరిగి రావాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము" అని తైవాన్ ఎంబసీ X లో పోస్ట్ చేసింది.

Scroll to load tweet…

వాన్ హాయ్ 503 ఓడలో మంటలు 

సింగపూర్ కి చెందిన వాన్ హాయ్ 503 అనే కంటైనర్ ఓడలోని లోపలి భాగంలో మంటలు చెలరేగాయి. ఈ మంటలు కేరళ తీరంలో జూన్ 9న చెలరేగాయి. మూడు రోజుల తర్వాత కూడా మంటలు పూర్తిగా ఆర్పలేకపోయారు. ఓడలో లక్ష మెట్రిక్ టన్నులకు పైగా ఇంధనం, ప్రమాదకర పదార్థాలు ఉన్నాయి. ఈ ఓడ కేరళలోని బేపూర్ కి 42 నాటికల్ మైళ్ళ దూరంలో ఉంది. ఇది భారతదేశపు ప్రత్యేక ఆర్థిక మండలంలోకి వస్తుంది.