తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ హాల్ టికెట్లను విడదుల చేశారు. పరీక్షకోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2025కి సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి.
హాల్ టికెట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
* అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళాలి: https://tgtet.aptonline.in/tgtet/
* హోమ్‌పేజ్‌లో కనిపించే ‘Hall Ticket Download’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* అక్కడ మీ జర్నల్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేయాలి
* వివరాలు నమోదు చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి
* హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది – డౌన్లోడ్ ఆప్షన్‌పై నొక్కి కాపీ సేవ్ చేసుకోవచ్చు
పరీక్షా తేదీలు
* జూన్ 18 & 19: పేపర్ 2 (గణితం, సైన్స్)
* జూన్ 20 – 23: పేపర్ 1
* జూన్ 24: పేపర్ 1 మరియు పేపర్ 2
* జూన్ 27: పేపర్ 1
* జూన్ 28 – 30: పేపర్ 2 (సోషల్ స్టడీస్)
* జూన్ 30న పేపర్ 2 (గణితం, సైన్స్) సెషన్ కూడా ఉంటుంది
టెట్ పరీక్షలు జూన్ 30తో ముగియనున్నాయి. అనంతరం ప్రాథమిక కీ విడుదల చేస్తారు. దానిపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. అన్ని దశలు పూర్తి చేసిన తర్వాత జూలై 22వ తేదీన తుది ఫలితాలను విడుదల చేయనున్నారు.
దరఖాస్తుల గణాంకాలు
మొత్తం టెట్ దరఖాస్తులు: 1,83,653
పేపర్ 1కి దరఖాస్తులు: 63,261
పేపర్ 2కి దరఖాస్తులు: 1,20,392