MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • RCB: డీకే శివకుమార్ ఆర్సీబీని కొంటున్నారా?.. ఆయన ఏం చెప్పారంటే?

RCB: డీకే శివకుమార్ ఆర్సీబీని కొంటున్నారా?.. ఆయన ఏం చెప్పారంటే?

RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విక్రయిస్తున్నారనే వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆర్సీబీ ని కోనుగోలు చేస్తున్నారనే అంశం వైరల్ గా మారింది. తాజాగా ఆయన ఈ విషయంపై స్పందించారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 11 2025, 07:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
RCB ఫ్రాంచైజీ కొనుగోలపై డీకే శివకుమార్ ఏమన్నారంటే?
Image Credit : X

RCB ఫ్రాంచైజీ కొనుగోలపై డీకే శివకుమార్ ఏమన్నారంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)ను కొనుగోలు చేస్తున్నట్లు వస్తున్న ఊహాగానాలను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఖండించారు. "నాకు టైం లేదు. చిన్నప్పటినుండి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సభ్యుడిని. ఆఫర్లు వచ్చినా, నన్ను మేనేజ్‌మెంట్‌లో చేర్చుకోవాలని చూశారు. కానీ, నాకు ఆసక్తి లేదు" అని ఆయన అన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నన్ను మ్యాడ్ మ్యాన్ అనుకుంటున్నారా?.. ఆర్సీబీ కోనుగోలుపై డీకే శివకుమార్ కామెంట్స్
Image Credit : Asianet News

నన్ను మ్యాడ్ మ్యాన్ అనుకుంటున్నారా?.. ఆర్సీబీ కోనుగోలుపై డీకే శివకుమార్ కామెంట్స్

ఆర్సీబీ కొనుగోలు వార్తలపై డీకే శివకుమార్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. "నేను పిచ్చివాడిని కాదు. నాకు ఆర్సీబీ ఎందుకు కావాలి? నేను రాయల్ ఛాలెంజ్ కూడా తాగను" అని కామెంట్స్ చేశారు. అలాగే, తనకున్న విద్యాసంస్థల నిర్వహణకు కూడా సమయం కేటాయించలేక కుటుంబ సభ్యులకు అప్పగించానని తెలిపారు.

35
ఆర్సీబీని డియాజియో అమ్ముతున్నారంటూ వార్తలు
Image Credit : X

ఆర్సీబీని డియాజియో అమ్ముతున్నారంటూ వార్తలు

బ్రిటిష్ మద్యం సంస్థ డియాజియో పీఎల్సీ, యునైటెడ్ స్పిరిట్స్ యాజమాన్యంలోని ఆర్సీబీని అమ్మె యోచనలో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఆర్సీబీపై తన వాటాను పూర్తిగా లేదా కొంత మేరకు విక్రయించే యోచనలో ఉన్నట్లు రిపోర్టులు పేర్కొన్నాయి. పరిశ్రమ వర్గాల ప్రకారం, డియాజియో సలహాదారులతో చర్చలు మొదలుపెట్టిందని, ఈ ఫ్రాంచైజీకి $2 బిలియన్ల వరకూ విలువ ఉండొచ్చని అంచనా.

ఈ వార్తలతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌లో యునైటెడ్ స్పిరిట్స్ షేరు ధర పెరిగింది. అయితే కంపెనీ ఈ సమాచారాన్ని ఖండిస్తూ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదని స్పష్టం చేసింది.

45
బెంగళూరు తొక్కిసలాట విషాదంపై రాజకీయ దుమారం
Image Credit : Twitter

బెంగళూరు తొక్కిసలాట విషాదంపై రాజకీయ దుమారం

ఆర్సీబీ జట్టు తమ తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత బెంగళూరులో జరిగిన RCB విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట జరిగింది. విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్ నేతృత్వంలోని జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన సందర్భంగా ఫ్యాన్స్ భారీగా రావడంతో బెంగళూరు స్టేడియం వద్ద జరిగిన ఈ విషాదంలో 11 మంది మృతి చెందగా 5O+ మందికి గాయాలయ్యాయి.

ఈ విషాద ఘటనపై ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ నేతలు ప్రహ్లాద్ జోషి, షెహజాద్ పూనావాలా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల రాజీనామా కోరారు. పోలీసులు ఇచ్చిన హెచ్చరికల్ని ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ ఘటన తర్వాత కర్నాటక సర్కారు పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసి, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో న్యాయ విచారణకు ఆదేశించారు.

55
ప్రజాస్వామ్యంలో నైతిక బాధ్యత అవసరం
Image Credit : Asianet News

ప్రజాస్వామ్యంలో నైతిక బాధ్యత అవసరం

ఇటీవల తన ఆస్తుల విషయాల్లో తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని డీకే శివకుమార్ స్పష్టం చేసినప్పటికీ, తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనపై ప్రశ్నలు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి పెద్ద ఈవెంట్ల నిర్వహణకు ప్రామాణిక కార్యాచరణ విధానాలు ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
బెంగళూరు
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image2
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image3
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Related Stories
Recommended image1
IPL 2026: రాజస్థాన్ రాయల్స్ నుంచి ఐదుగురు స్టార్ ప్లేయర్లు అవుట్
Recommended image2
WTC Final: ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్.. బిగ్ ఫైట్ ప్లేయింగ్ 11 వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved