అనంత సీట్లన్నీ మావే:జేసీ దివాకర్ రెడ్డి

By narsimha lodeFirst Published Apr 12, 2019, 6:29 PM IST
Highlights

మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున టీడీపీకి ఓటు వేశారని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పసుపు, కుంకుమ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు సరైన సమయంలో అందిన చెక్కులు టీడీపీకి కలిసి వచ్చాయన్నారు.

డ్వాక్రా మహిళలకు సరైన సమయంలో అందిన చెక్కులు టీడీపీకి కలిసి వచ్చాయన్నారు.

శుక్రవారం నాడు ఆయన అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాయన్నారు. అందుకే పెద్ద ఎత్తున  మహిళ ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారని ఆయన తెలిపారు. 

అనంతపురం లోక్‌సభ స్థానం పరిధిలోని అభ్యర్థులను మార్చాలని తాను  చంద్రబాబును కోరినట్టుగా చెప్పారు.  కానీ, చంద్రబాబునాయుడు మాత్రం కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చలేదన్నారు.   అనంతపురం టౌన్, శింగనమల, గుంతకల్లు అసెంబ్లీ స్థానాల్లో కూడ టీడీపీ విజయం సాధిస్తోందన్నారు. మే 23 వ తేదీ తర్వాత చూడాలని ఆయన మీడియా ప్రతినిధులకు సూచించారు.

చంద్రబాబు పిలుపుతో ఆయనకే ఓటేసేందుకు తిరిగి పోలింగ్ బూత్‌లకు చేరుకొన్నారని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.  సహజంగా క్యూలో ఉండే మహిళలు ఒక్కసారి ఇంటికి తిరిగి వెళ్లిన వారు  తిరిగిరారన్నారు. రాష్ట్రంలో అర్ధరాత్రి దాకా ఓట్లు వేయడం అంటే రాష్ట్రంలో సైలెంట్ వేవ్ మహిళల్లో ఉందన్నారు. రాయలసీమలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు ఒ లెక్క... ఇప్పుడు జరిగిన ఎన్నికలు ఇంకో లెక్క అని  జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

రెండు రోజుల క్రితం వరకు అనంతపురం, శింగనమల, గుంతకల్లు అసెంబ్లీ సీట్లలో ఓటమి పాలయ్యే అవకాశం ఉందని భావించినట్టు చెప్పారు. కానీ,  పోలింగ్ రోజున మహిళల నుండి వచ్చిన స్పందన చూస్తే అనంతపురం ఎంపీ స్థానంలో అన్ని సీట్లను కైవసం చేసుకొంటామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

నేనేసిన ఓటు నాకు పడిందా: చంద్రబాబు అనుమానం

మే 23 తర్వాత ముహుర్తం చూసుకొని ప్రమాణం చేస్తా: బాబు

సీఎస్ సుబ్రమణ్యం కోవర్టు: చంద్రబాబు సంచలనం

సైలెంట్ వేవ్, జగన్‌కు వ్యతిరేకమే: చంద్రబాబు అంచనా

ప్రచారానికి మూడు రోజుల సెలవు అందుకే: జగన్‌పై చంద్రబాబు

సీఈఓ ద్వివేదికే దిక్కులేదు, సామాన్యుల పరిస్థితి ఏమిటీ:చంద్రబాబు

ముందస్తు కుట్ర చేశారు, అయినా...: చంద్రబాబు

వైసీపీ అభ్యర్థి ప్రకాష్‌రెడ్డికి పరిటాల సునీత వార్నింగ్

ఆళ్లగడ్డ ఘర్షణలు: భూమా అఖిలప్రియ భర్తపై కేసు

క్యూను దాటేసి ఓటేసిన పవన్ కళ్యాణ్: ఓటర్ల అసహనం

మూడు ఓట్ల కోసం చంద్రగిరి సెగ్మెంట్‌లో హైడ్రామా

150 కేంద్రాల్లో రీ పోలింగ్‌కు చంద్రబాబు డిమాండ్

చిత్తూరులో టీడీపీ, వైసీపీ ఘర్షణ: వైసీపీ కార్యకర్త మృతి

పోలీసులతో జనసేన కార్యకర్తల ఘర్షణ: గాల్లోకి కాల్పులు

పోలీస్‌స్టేషన్‌లో జేసీ దివాకర్ రెడ్డి వీరంగం

రాహుల్ తలకు లేజర్ లైట్‌: ఫోన్ లైటేనన్న కేంద్రం

ఓటేసిన వారికి పెట్రోల్ డీలర్ల బంపర్ ఆఫర్

పూతలపట్టు వైసీపీ అభ్యర్ధి బాబుపై టీడీపీ దాడి

చేతులు ముడుచుకోలేం: భూమా విఖ్యాత్ రెడ్డి

ఓ రాజకీయ పార్టీ వ్యాఖ్యలపై మాట్లాడను: సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది

రవిని కిడ్నాప్ చేశారంటూ ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీ ధర్నా

తలుపులేసుకొని బూత్‌లో ధర్నా: స్పృహ తప్పి పడిపోయిన కోడెల

తాడిపత్రి లో టీడీపీ, వైసీపీ ఘర్షణ: ఇద్దరు మృతి

ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీకే పడుతుంది: బాబుకు ద్వివేది కౌంటర్

మంగళగిరిలో పనిచేయని ఈవీఎంలు: ధర్నాకు దిగిన వైసీపీ అభ్యర్ధి ఆర్కే

చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తత

టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ: భూమా అఖిలప్రియ భర్తకు గాయాలు

ఏపీ పోలింగ్‌లో ఉద్రిక్తత: పలు చోట్ల వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు

చిరంజీవితో సెల్ఫీ దిగిన ఎన్నికల అధికారి

ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు

దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి

ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి

 

click me!