ఆటవిడుపు: ప్రశాంత్ కిశోర్ ఆఫీసులో వైఎస్ జగన్

By telugu teamFirst Published Apr 12, 2019, 5:09 PM IST
Highlights

శుక్రవారంనాడు జగన్ తన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను కలిశారు. హైదరాబాదులోని ఐ క్యాప్ కార్యాలయానికి వెళ్లి ఆయన ప్రశాంత్ కిశోర్ సిబ్బందిని పలకరించారు. సిబ్బందితో మాట్లాడుతూ ఆయన ఉల్లాసంగా కనిపించారు. 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోకసభ ఎన్నికలు ముగియడంతో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాస్తా విశ్రాంతి దొరికినట్లుంది. చాలా కాలంగా ఆయన ప్రజల మధ్యనే ఉంటూ వచ్చారు. గురువారం సాయంత్రం హైదరాబాదులో గల తన నివాసం లోటస్ పాండులో మీడియాతో మాట్లాడారు. 

శుక్రవారంనాడు జగన్ తన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను కలిశారు. హైదరాబాదులోని ఐ క్యాప్ కార్యాలయానికి వెళ్లి ఆయన ప్రశాంత్ కిశోర్ సిబ్బందిని పలకరించారు. సిబ్బందితో మాట్లాడుతూ ఆయన ఉల్లాసంగా కనిపించారు. ప్రశాంత్ కిశోర్ జట్టు సభ్యులకు జగన్ కృతజ్ఢతలు తెలిపారు. రెండేళ్లు తన కోసం పనిచేసినందుకు ధన్యవాదాలు చెప్పారు. టీం సభ్యులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన ప్రశాంత్ కిశోర్ కార్యాలయంలో ఉన్నారు.

ప్రశాంత్ కిశోర్ రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన బీహార్ నుంచి వచ్చి హైదరాబాదులోనే ఉంటూ ఎన్నికల వ్యూహాలను రచిస్తూ వచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు లోకసభ ఎన్నికల ఫలితాలతో పాటు మే 23వ తేదీన వెలువడనున్న విషయం తెలిసిందే. 

ప్రశాంత్ కిశోర్ ఆఫీసులో వైఎస్ జగన్ (ఫొటోలు)

 

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి

click me!