ఆస్ట్రేలియా నుండి చరిత్రాత్మక విగ్రహాలు భారత్ కు... స్వయంగా పరిశీలించిన ప్రధాని మోదీ
న్యూడిల్లి: భారత దేశ ఔన్నత్యాన్ని చాటే చారిత్రాత్మక చర్యలు తీసుకుంది.
న్యూడిల్లి: భారత దేశ ఔన్నత్యాన్ని చాటే చారిత్రాత్మక చర్యలు తీసుకుంది. ఎంతో చరిత్ర కలిగిన హిందూ దేవతామూర్తులు, పురాతన విగ్రహాలు వివిధ మార్గాల ద్వారా అక్రమంగా విదేశాలనకు తరలిపోయాయి. ఇలా ఆస్ట్రేలియాకు తరలిన 29 విగ్రహాలను తిరిగి భారత్ కు చేర్చింది మోదీ ప్రభుత్వం. ఇలా దేశానికి చేరిన చారిత్రాత్మక విగ్రహాలను ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు.
పరమశివుడు, విష్షుమూర్తి, అమ్మవారు, జైన్ విగ్రహాలతో పాటు మరికొన్ని పురాతన విగ్రహాలు కూడా భారత ప్రభుత్వం ఆస్ట్రేలియా నుండి తీసుకువచ్చింది. గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ నుండి 9లేదా 10వ సెంచరీలో ఈ విగ్రహాలు విదేశాలకు అక్రమంగా తరలినట్లు భావిస్తున్నారు. వాటిని ఆస్ట్రేలియాలో గుర్తించి ప్రభుత్వం తిరిగి దేశానికి తీసుకురావడంతో సఫలికృతం అయ్యింది.