కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలిసారి కేబినెట్‌లోకి

కేేసీఆర్ ఆదివారం నాడు మంత్రివర్గాన్ని విస్తరించారు. ఆరుగురికి మంత్రి వర్గంలో చోటు దక్కింది. ఆరుగురిలో ముగ్గురి మాత్రం తొలిసారిగా మంత్రి పదవులు దక్కించుకొన్నారు.. 

here is the list of first time mnisters in kcr cabinet

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించారు. ఆరుగురికి మంత్రివర్గంలో చోటు దక్కింది.ఆరుగురిలో ముగ్గురికి తొలిసారిగా మంత్రి పదవి అవకాశం దక్కింది. తొలిసారిగా మంత్రి పదవులు దక్కించుకొన్నవారిలో గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్‌లు  ఉన్నారు.

టీడీపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ లకు మంత్రి పదవులు లభించాయి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వీరిద్దరూ కూడ 2009లో అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు గంగుల కమలాకర్  టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. సత్యవతి రాథోడ్ కూడ అదే సమయంలో టీడీపీని వీడారు.

2014, 2018 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి గంగుల కమలాకర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి కమలాకర్ కు చోటు దక్కింది. గతంలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన సత్యవతి రాథోడ్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. సత్యవతి రాథోడ్ ఎస్టీ సామాజిక వర్గం కోటాలో కేసీఆర్ కేబినెట్ లో చోటు దక్కించుకొన్నారు.

ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి పువ్వాడ అజయ్ కుమార్ విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో ఆయన వరుసగా ఈ స్థానం నుండి విజయం సాధించారు. తొలుత కాంగ్రె స్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఖమ్మం జిల్లాతో పాటు కమ్మ సామాజిక వర్గం నుండి పువ్వాడ అజయ్ కుమార్ కు కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కింది.

పువ్వాడ అజయ్ తండ్రి ప్రముఖ సీపీఐ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు.  తండ్రి సీపీఐలో ఉన్నప్పటికీ అజయ్ కాంగ్రెస్, వైఎస్ఆర్ సీపీలలో పనిచేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు.
 

సంబంధిత వార్తలు

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలుత హరీష్, చివరగా పువ్వాడ

టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్: రికార్డుల విజేత హరీష్ రావు

భర్త మరణంతో రాజకీయాల్లోకి.. మూడోసారి మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి

టీఆర్ఎస్‌లో కీలకనేతగా కేటీఆర్: మెడిసిన్‌ కాదని ఐటీ వైపు

బీజేపీ దూకుడు: చెక్ పెట్టే దిశగా కేసీఆర్ ప్లాన్ ఇదీ..

బెర్త్ ఖరారైన అభ్యర్థులకు ఫోన్ కాల్స్: హరీష్ ఉన్నా కేసీఆర్ తర్వాత కేటీఆరే

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios